అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్‌.. లష్కర్ కమాండర్ ఉజైర్ ఖాన్ హతం

By Medi Samrat  Published on  19 Sep 2023 10:16 AM GMT
అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్‌.. లష్కర్ కమాండర్ ఉజైర్ ఖాన్ హతం

అనంత్‌నాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడో రోజైన మంగళవారం లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కమాండర్ ఉజైర్ ఖాన్ హతమైనట్లు ఓ అధికారి తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగా.. మూడో ఉగ్రవాది ఉన్నట్లు అనుమానిస్తున్నప్పటికీ.. అధికారులు మరో ఉగ్రవాది మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. హతమైన ఉగ్రవాది నుంచి ఆయుధాన్ని కూడా భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారని కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఉజైర్ ఖాన్ మరణంతో.. ఏడు రోజుల పాటు జరిగిన ఎన్‌కౌంటర్ ముగిసిందని.. అయినప్పటికీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన చెప్పారు.

చ‌నిపోయిన‌ ఉజైర్ ఖాన్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదనంగా మరో ఉగ్రవాది శవం లభ్యమైంది. అనంతనాగ్ ఎన్‌కౌంటర్ ముగిసిం.. అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది, ”అని ADGP పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. "శోధించాల్సిన పెద్ద ప్రాంతం ఉంది. అక్కడ పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి ఉంది. అవి వెలికి తీసి.. నాశనం చేయబడతాయి. ఆ ప్రాంతానికి వెళ్లవద్దని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారాయన. ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు అక్కడ ఉన్నారని భద్రతా బలగాలకు సమాచారం ఉందని ఏడీజీపీ తెలిపారు. మూడో మృతదేహం ఎక్కడో ఉండే అవకాశం ఉందో.. సోదాలు పూర్తయిన తర్వాత తెలుస్తుందని కుమార్ తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా కోకెర్‌నాగ్ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య గత వారం బుధవారం ఎన్‌కౌంటర్ ప్రారంభ‌మైంది.

Next Story