ఫాస్ట్‌ఫుడ్‌ తినేవారికి లేమ్‌ ఫీవర్‌.. బిహార్‌లో కలకలం

మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వైరల్‌ ఫీవర్ల వ్యాప్తి పెరగడం సాధారణమే. బిహార్‌ రాజధాని పట్నాలో అంతుచిక్కని వైరల్‌ ఫీవర్‌ వేగంగా వ్యాపించడం కలకలం రేపుతోంది.

By అంజి  Published on  7 Nov 2024 1:23 PM IST
ఫాస్ట్‌ఫుడ్‌ తినేవారికి లేమ్‌ ఫీవర్‌.. బిహార్‌లో కలకలం

మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వైరల్‌ ఫీవర్ల వ్యాప్తి పెరగడం సాధారణమే. బిహార్‌ రాజధాని పట్నాలో అంతుచిక్కని వైరల్‌ ఫీవర్‌ వేగంగా వ్యాపించడం కలకలం రేపుతోంది. దీన్ని లేమ్‌ ఫీవర్‌, లాంగ్డా ఫీవర్‌ అని పిలుస్తున్నారు. ఈ జ్వరం బారిన పడినవారు మోకాళ్‌లు, నడుము పైభాగంలో భరించలేని నొప్పి ఉండి, నడవడానికి ఇబ్బంది తలెత్తి కాస్త వంగి నడవాల్సి వస్తుంది. అందుకే దీన్ని కుంటి జ్వరం అని కూడా పిలుస్తున్నారు. చికెన్‌ గున్యా కంటే దీని లక్షణాలు కాస్త వేరుగా ఉన్నాయని అక్కడి వైద్యులు చెబుతున్నారు.

ముఖ్యంగా పట్నా నగరంలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో జంక్‌ఫుండ్‌ తినేవారిలో ఈ జ్వరం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలిపారు. లేమ్‌ ఫీవర్‌ ఎక్కువగా దోమల వల్ల వ్యాపిస్తోంది. చికెన్ గున్యా కంటే కాస్త భిన్నంగా ఈ జ్వర లక్షణాలు అక్కడి వైద్య అధికారులకు సవాల్‌గా మారాయి. అయితే చికెన్‌ గున్యా మాదిరిగానే ఈ జ్వరం ఎక్కువ కాలం ఇబ్బంది పెడుతోంది. ఫీవర్‌ తగ్గినా 10 నుంచి 15 రోజుల వరకు రోగి సరిగా నడవలేకపోతున్నాడు.

Next Story