లాలూ ప్రసాద్ యాదవ్ కూతురి భావోద్వేగ పోస్ట్.. 'నాన్న మీరే నా హీరో'
Lalu Yadav's daughter pens emotional note for father.బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత
By తోట వంశీ కుమార్
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రెండు రోజుల క్రితం మైట్లపై నుంచి జారి పడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు వీపు భాగాన గాయమై, భుజం విరిగింది. పాట్నాలోని పారస్ ఆసుపత్రిలోని ఐసీయూలో లలూకి చికిత్స అందిస్తున్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మూత్ర పిండ మార్పిడి చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది.
తండ్రి ఆరోగ్య పరిస్థితి పట్ల ఆయన కుమారై రోహిణీ ఆచార్య భావోద్వేగానికి గురవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 'నా హీరో, నా బ్యాక్‌బోన్ నువ్వే పాపా' అని రాసింది. 'నాన్నే నా హీరో, నా బ్యాన్ బోన్, త్వరగా కోలుకో నాన్న. ఎన్నో అవరోధాలను జయించావు. నీ వెంట కోట్లాది మంది ప్రజల ఆశ్సీసులు ఉన్నాయి. వారి అభిమానమే ఆయన బలం. 'అంటూ రోహిణీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రోహిణీ సింగపూర్‌లో ఉంటున్నారు. తన తండ్రి ఆరోగ్యాన్ని ఆమె వీడియో కాల్ ద్వారా అడిగితెలుసుకున్నారు.
My hero
— Rohini Acharya (@RohiniAcharya2) July 5, 2022
My backbone Papa🙏
Get well soon 🤞
हर बाधाओं से जिसने पाई है मुक्ति
करोड़ों लोगों की दुआएं है जिनकी शक्ति🙏 pic.twitter.com/36ndAbRnTG
నిజానికి లాలూ యాదవ్‌కి తన కూతుళ్లతో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ. ముఖ్యంగా మిసా, రోహిణిలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఉంటారు. ఇక గత కొద్ది రోజులుగా లలూ ప్రసాద్ యాదవ్‌ను అనారోగ్యం వేదిస్తోంది. దీంతో ఆయన రాజకీయాలకు కొంత దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలో పార్టీ పగ్గాలను ఇద్దరు కుమారుల్లో ఒకరికి అప్పచెబుతారని వార్తలు వినిపిస్తున్నాయి.