ఆర్జేడీ చీఫ్ లాలూ సంచలన నిర్ణయం..కుమారుడిపైనే బహిష్కరణ వేటు
రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By Knakam Karthik
ఆర్జేడీ చీఫ్ లాలూ సంచలన నిర్ణయం..కుమారుడిపై బహిష్కరణ వేటు
రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి ఆరు సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీతో పాటు కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎక్స్‌లో లాలూ పోస్టు చేశారు. ప్రవర్తన, బాధ్యతా రహిత వైఖరి కారణంగానే తొలగించానని తెలిపారు. తేజ్ ప్రతాప్ ప్రవర్తన తమ కుటుంబ సంప్రదాయాలకు సరిపోలడం లేదని పేర్కొన్నారు.
ఇంతకీ ఏం జరిగింది?
అయితే ఓ యువతితో తేజ్ ప్రతాప్ బహిరంగంగా రొమాన్స్ చేస్తున్నట్లు ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్రంలోని అన్ని పార్టీ నేతలు లాలూ ఫ్యామిలీపై విమర్శలు చేశారు. దీంతో కుటుంబంపై ఇతరులు చేసే విమర్శలు తట్టుకోలేకపోయిన లాలూ.. అటు పార్టీ నుంచి, ఇటు కుటుంబం నుంచి తేజ్ ప్రతాప్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై తేజ్ ప్రతాప్ ఇప్పటికే స్పందించారు. దీనిపై ఆయన ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. తన సోషల్ మీడియాను ఎవరో హ్యాక్ చేశారని తెలిపారు. తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేందుకే ఎవరో ఇలాంటి పోస్టు చేశారని ఆరోపించారు. ఆ ఫొటో సైతం ఎడిట్ చేసిందని వెల్లడించారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని తన అభిమానులను కోరారు.