కోల్‌కతా డాక్టర్ రేప్ కేసు.. నిందితుడికి జీవిత ఖైదు
By Knakam Karthik Published on 20 Jan 2025 3:24 PM ISTకోల్‌కతా డాక్టర్ రేప్ కేసు.. నిందితుడికి జీవిత ఖైదు
దేశంలో సంచలనం సృష్టించిన కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో సీల్దా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కి కోర్టు శిక్షను ఖరారు చేసింది. దోషిగా తేలిన సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు, రూ.50 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. శనివారం అతడిని న్యాయస్థానం దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే.
గత సంవత్సరం ఆగస్టు 9వ తేదీన కోల్‌కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్‌లో సెమినార్ గదిలో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది. వెస్ట్ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్ కతా పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించి, విచారించింది. దీనిలో భాగంగా స్పెషల్ కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. గ్యాంగ్ రేప్ కేసు విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. హాస్పిటల్‌లో ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్‌ను ఆగస్టు 10వ తేదీన కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు.