కేరళ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. అధికారులు ఏం చేశారంటే

Kerala secretariat staffer suspended over WhatsApp post about Pinarayi Vijayan.కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌పై ఆ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Feb 2022 3:00 PM IST
కేరళ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. అధికారులు ఏం చేశారంటే

కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌పై ఆ రాష్ట్ర స‌చివాలయ ఉద్యోగి ఒక‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది. స్పందించిన అధికారులు వెంట‌నే స‌ద‌రు ఉద్యోగిని విధుల నుంచి తొల‌గించారు. అస‌లు ఆ ఉద్యోగి ఏం వ్యాఖ్య‌లు చేశాడు.? ఎందుకు తొల‌గించారంటే..?

వివ‌రాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విదేశాల్లో పర్యటించారు. అందులో భాగంగా ఇటీవ‌ల యూఏఈ వెళ్లారు. ఆ దేశ విదేశీ వాణిజ్య మంత్రి శాఖ‌, మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశంలో కేర‌ళ రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ఉన్న అవ‌కాశాల‌ను, కేర‌ళ ప్ర‌భుత్వం ఇస్తున్న రాయితీల‌ను వారికి వివ‌రించారు. కాగా.. ఈ భేటి అనంత‌రం యూఏఈ అధికారులు, మంత్రుల‌తో కలిసి దిగిన ఫోటోల‌ను సీఎం అధికారిక ఖాతాలో పోస్టు చేశారు. ఆ ఫోటోల్లో విజ‌య‌న్ బ్లాక్ క‌ల‌ర్ సూట్ వేసుకున్నారు.

అయితే.. స‌చివాల‌యంలో ప‌నిచేసే మ‌ణికుట్ట‌న్ ఉద్యోగి త‌న వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఫోటోల‌ను షేర్ చేశాడు. ఆ షోటోల కింద గూండాలు వేర్వేరు వేషాదార‌ణ‌లో ఉన్నారంటూ సీఎంపై అనుచిత వ్యాఖ్య‌లు. ఈ విష‌యాన్ని వాట్సాప్ గ్రూప్‌లోని కొంద‌రు స‌చివాల‌య అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సీఎం కార్యాల‌య అధికారులు.. వెంట‌నే మ‌నికుట్ట‌న్‌ను వెంట‌నే విధుల నుంచి త‌ప్పించారు. కాగా .. మణికుట్టన్ కాంగ్రెస్ అనుకూల సచివాలయ ఉద్యోగుల సంఘంలో సభ్యుడిగా ఉన్నాడు.


Next Story