కేరళ ర్యాగింగ్ హార్రర్.. ప్రైవేట్ భాగాలకు డంబెల్స్ వేలాడదీయించారు

కేరళ కొట్టాయం నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు.

By Knakam Karthik  Published on  12 Feb 2025 4:23 PM IST
National News, Ragging, Medical College, Kerala, Kottayam

కేరళలో ర్యాగింగ్ భూతం..ప్రైవేట్ పార్ట్స్‌కు డంబెల్స్ కట్టి మరీ వేధింపులు

కేరళ కొట్టాయం నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. జూనియర్ విద్యార్థులు పోలీసులకు కంప్లయింట్ చేయడంతో ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కొట్టాయంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న శామ్యూల్ జాన్సన్, జీవా, రాహుల్ రాజ్, రిజిల్ జిత్, వివేక్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

గత సంవత్సరం నవంబర్ నుంచి ర్యాగింగ్ పేరుతో ఈ ఐదుగురు విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులను వేధిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ వేధింపులు భరించలేక ముగ్గురు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సమీపంలోని గాంధీనగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్ పేరుతో తమను నగ్నంగా నిలబెట్టి ప్రైవేట్ పార్ట్స్‌కు డంబెల్స్‌ను వేలాడ దీశారని.. కంపాక్స్‌ బాక్స్‌లోని పరికరాలను ఉపయోగించి తమను తీవ్రంగా గాయపరిచారని ఫస్ట్ ఇయర్ విద్యార్థులు తమ బాధను పోలీసుల ఎదుట చెప్పుకున్నారు. ర్యాగింగ్ పేరుతో నిందితులు జూనియర్ విద్యార్థుల శరీరాలపై గాట్లు పెట్టి, వాటిపై లోషన పోసేవారని, బాధతో కేకలు వేసినప్పుడు.. నోట్లో కెమికల్ పోసేవారని పోలీసులకు చెప్పారు.

కాగా ర్యాగింగ్‌కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేసింది. ర్యాగింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు నిర్వహించిన తర్వాత ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. అయితే ర్యాగింగ్ గురించి బాధిత విద్యార్థులు కాలేజీలో చెప్పలేదని ప్రిన్సిపాల్ లిని జోసెఫ్ తెలిపారు. తల్లిదండ్రులు ఓ ఉపాధ్యాయుడికి ఫోన్ చేసి విషయం చెప్పారని ప్రిన్సిపాల్ తెలిపారు. ఫిర్యాదు అందిన తర్వాత ప్రాథమిక విచారణ తర్వాత చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

Next Story