వయనాడ్‌ మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా: ప్రధాని

కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla
Published on : 30 July 2024 12:45 PM IST

kerala, landslide, deaths, pm modi

వయనాడ్‌ మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా: ప్రధాని 

కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగింది. మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి. ఇప్పటి వరకు 50 మంది జలసమాధి అయ్యారు. వారి మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కాగా.. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర ముఖ్య నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఎక్స్‌ వేదిక గా పోస్టు పెట్టారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ నేపథ్యంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో ఫోన్లో మాట్లాడానని ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితులు.. కొనసాగుతున్న సహాయక చర్యల గురించి వివరాలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్ని రకాలుగా సాయం అందిస్తామని సీఎం పినరయి విజయన్‌కు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఇక మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ప్రధాని మోదీ. మరోవైపు బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి పీఎం ఎన్‌ఆర్‌ఎఫ్‌ కింద రూ.2లక్షలు పరిహారం ఇస్తున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఇక గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.




Next Story