కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ ఇరుముడితో అయ్యప్ప దర్శనానికి..

Kerala Governor Arif Mohammed Khan on pilgrimage to Sabarimala. తాజాగా కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ ఇరుముడితో అయ్యప్ప దర్శనానికి వెళ్లడం హాట్ టాపిక్ అయింది.

By Medi Samrat  Published on  12 April 2021 6:27 AM GMT
Kerala Governor visits Shabarimala

కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయం చుట్టూ ఇటీవలి కాలంలో ఎన్నో వివాదాలు కొనసాగిన సంగతి తెలిసిందే..! తాజాగా కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ ఇరుముడితో అయ్యప్ప దర్శనానికి వెళ్లడం హాట్ టాపిక్ అయింది. ఆదివారం నాడు ఆయన శబరిమల ఎక్కి అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకున్నారు. 5 కిలోమీటర్లు నడిచి.. సాధారణ అయ్యప్ప భక్తుడి లాగే దర్శనం చేసుకోవడం విశేషం.

మాస పూజలు, విషుం పండుగ సందర్భంగా శబరిమల అయప్పస్వామి ఆలయాన్ని రెండు రోజుల కిందట తెరిచారు. ఈ నేపథ్యంలో కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ ఆదివారం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకుని, పూజలు నిర్వహించారు. తన తన చిన్న కుమారుడితో కలిసి స్వామిని దర్శించుకున్నారు.

మెడలో మాలను ధరించి, ఇరుుమడితో ఐదు కిలోమీటర్లు కాలినడకన కొండ ఎక్కారు. అనంతరం 18 మెట్ల గుండా సన్నిధానానికి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద గవర్నర్‌కు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్.వాస్, ఇతర సభ్యులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. 2018 లో 10-50 సంవత్సరాల మహిళలు కూడా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవచ్చు అంటూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత ఈ వివాదం ఎంతో పెద్దదైంది.


Next Story