మ్యాచ్ చూడడానికి వెళ్లారు.. నిప్పురవ్వలు పడ్డాయి

కేరళలో ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఫైనల్ సందర్భంగా జరిగిన బాణాసంచా ప్రమాదంలో చిన్నారులు సహా 40 మంది గాయపడ్డారు.

By Knakam Karthik
Published on : 19 Feb 2025 4:13 PM IST

National News, Kerala, FootBall Match, Fireworks Mishap

మ్యాచ్ చూడడానికి వెళ్లారు.. నిప్పురవ్వలు పడ్డాయి

కేరళలోని అరీకోడ్‌లోని తేరట్టమ్మాళ్‌లో స్థానిక ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఫైనల్ సందర్భంగా జరిగిన బాణాసంచా ప్రమాదంలో చిన్నారులు సహా 40 మంది గాయపడ్డారు. మంగళవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో అనుమతి లేకుండా బాణాసంచా పేల్చడంతో జనం పరుగులు పెట్టారు. పలువురు పడిపోవడంతో గాయాలపాలయ్యారు, మరికొందరికి స్వల్ప కాలిన గాయాలయ్యాయి.

యునైటెడ్ ఎఫ్.సి. నెల్లికుట్ వర్సెస్ కె.ఎం.జి.మావూరు మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ని చూసేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో ఈ దుర్ఘటన జరిగింది. చైనీస్ బాణసంచాగా పోలీసులు గుర్తించారు. బాణసంచా నుండి వచ్చిన నిప్పురవ్వలు ప్రేక్షకుల మీద పడ్డాయి. మైదానం సమీపంలో నిలబడి ఉన్న అనేక మందికి కాలిన గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. ఎలాంటి అనుమతులు లేకుండా బాణాసంచా కాల్చినందుకు టోర్నీ నిర్వాహక కమిటీపై ఆరీకోడ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story