తెరుచుకున్న కేధార్ నాథ్ ఆలయం

Kedarnath Temple reopened. హిందువులు పవిత్రంగా భావించే 'చార్​ధామ్'​ దేవాలయాల్లో ఒకటైన కేధార్ నాథ్ ఆలయం ఇవాళ తెరచుకుంది.

By Medi Samrat
Published on : 17 May 2021 3:21 PM IST

Kedarnath temple

హిందువులు పవిత్రంగా భావించే 'చార్​ధామ్'​ దేవాలయాల్లో ఒకటైన కేధార్ నాథ్ ఆలయం ఇవాళ తెరచుకుంది. అయితే కరోనా ఉదృతం గా ఉన్న ఈ పరిస్థితులలో భక్తులకు ప్రవేశం లేదు. మంచు కారణంగా 2020 డిసెంబర్ 16న ఆలయాన్ని మూసేశారు. సీజన్ పూర్తి కావడంతో ఈ ఉదయం 5గంటలకు ఆలయాన్ని తెరిచారు పూజారులు, అధికారులు. చార్‌ధామ్ యాత్ర‌లో య‌మునోత్రి ఆల‌యాన్ని ముందు తెరుస్తారు. తరువాత గంగోత్రి, ఆ తరువాత కేదార్‌నాథ్‌, చివరగా బ‌ద్రీనాథ్ ఆల‌యాల‌ను తెరుస్తారు. కేదార్ నాథ్ ఆలయ ప్రారంభానికి ముందు నిన్న ఆలయాన్ని పూలతో అలంకరించి డోలీ ఉత్సవం నిర్వహించారు.

భక్తులకు అనుమతి లేకపోయినప్పటికీ అన్ని ఆలయాల్లోనూ పూజలు, ఇతర కార్యక్రమాలు కొనసాగుతాయని అధికారులు ప్రకటించారు. కేధార్ నాథ్ ఆలయం తెరుచుకున్న సందర్బంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ ట్వీట్ చేశారు. ప్రజలందరినీ ఆరోగ్యంగా ఉంచాలని కేదారీశ్వరుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.

అద్భుతమైన చార్ ధామ్ యాత్ర అనేది వివిధ దేవతలకు ప్రార్ధనలు చేయడానికి చేపట్టిన తీర్ధయాత్ర. శ్రీ ఆది శంకరాచార్యులవారు సుమారు 1200 సంవత్సరాల క్రితం చార్ ధామ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుండి ఈ తీర్ధయాత్ర సాంప్రదాయం కొనసాగుతూనే వస్తుంది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే భక్తులు ప్రతి ఏటా ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దీపావళి తరువాత శీతాకాలంలో ఎముకలు కొరికే చలి, మంచు కారణంగా ఈ ఆలయాల ద్వారాలను మూసి వేస్తారు. అయితే కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా పూజలన్నీ భక్తులు లేకుండానే జరుగుతున్నాయి.



Next Story