ఏడేళ్ల చిన్నారిపై స్వామీజీ అసభ్య ప్రవర్తన.. షాకింగ్ వీడియో వైరల్!
కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఒక స్వయం ప్రకటిత స్వామీజీ ఏడేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.
By - అంజి |
ఏడేళ్ల చిన్నారిపై స్వామీజీ అసభ్య ప్రవర్తన.. షాకింగ్ వీడియో వైరల్!
కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఒక స్వయం ప్రకటిత స్వామీజీ ఏడేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చివరికి రంగంలోకి దిగిన పోలీసులు సదరు స్వామీజీపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. షాహాపూర్‌లోని ఒక మఠానికి చెందిన మల్లికార్జున ముత్తవ అనే స్వామీజీ వద్దకు మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన ఒక కుటుంబం వచ్చింది.
ఆ సమయంలో స్వామీజీ సదరు చిన్నారిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని, అసభ్యంగా ప్రవర్తిస్తూ ముద్దులు పెట్టుకున్నాడు. విచారకరమైన విషయం ఏమిటంటే, ఇదంతా జరుగుతున్నప్పుడు బాలిక తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. వారు దానిని తప్పుగా భావించకపోగా, ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. వైరల్ వీడియోను కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా పరిగణించింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. జిల్లా శిశు సంరక్షణ అధికారులు ఆశ్రమాన్ని సందర్శించి బాలిక, ఆమె తల్లిదండ్రుల నుంచి స్టేట్‌మెంట్‌లు రికార్డు చేశారు.
స్వామీజీ చర్యల్లో తమకు ఎలాంటి తప్పు కనిపించలేదని, భక్తితోనే అలా చేశారని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. వీడియోలో స్వామీజీ తాకుతున్నప్పుడు ఆ చిన్నారి తీవ్ర అసౌకర్యానికి లోనైనట్లు స్పష్టంగా కనిపిస్తోందని కమిటీ గుర్తించింది. కౌన్సెలింగ్ అనంతరం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సిఫార్సు మేరకు యాద్గిర్ పోలీసులు స్వామీజీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితుడికి నోటీసులు జారీ చేశామని, చట్టపరమైన విచారణ కొనసాగుతుందని ఎస్పీ వెల్లడించారు.
A self-styled godman in Karnataka’s Yadgir district has been booked under the Protection of Children from Sexual Offences (Pocso) Act after a viral video showing him behaving inappropriately with a seven-year-old girl sparked outrage. The video shows the godman, Mallikarjuna… pic.twitter.com/5edAIElrHA
— IndiaToday (@IndiaToday) February 26, 2026