రాష్ట్రంలో ఓలా, ఉబర్, ర్యాపిడోలపై బ్యాన్.. హైకోర్టు సంచలన తీర్పు
రాష్ట్రంలో ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ఆధారిత సంస్థల బైక్ ట్యాక్సీ సేవలను నిషేధిస్తూ కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik
రాష్ట్రంలో ఓలా, ఉబర్, ర్యాపిడోలపై బ్యాన్.. హైకోర్టు సంచలన తీర్పు
రాష్ట్రంలో ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ఆధారిత సంస్థల బైక్ ట్యాక్సీ సేవలను నిషేధిస్తూ కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సేవలపై బ్యాన్ విధించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరణాత్మక నివేదికను ఆరు వారాల్లో సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్-93ని అనుసరించి నిబంధనలు ఏర్పాటు చేసేవరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని చెప్పింది. అపతి వరకు ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ సర్వీసులు రోడ్లపై తిరగడానికి వీల్లేదని కోర్ట్ స్పష్టం చేసింది. తమను రవాణా సేవల సంస్థలుగా పరిగణించి లైసెన్సులు ఇవ్వాలని ఆ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను కోర్ట్ కొట్టివేసింది. ఈ నిషేధం బెంగళూరు వంటి నగరాల్లో రోజువారీ ప్రయాణికులపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆటోలకు మొదటి 2 కి.మీటర్లకు రూ. 30, ఆ తర్వాత కి.మీ.కి రూ.15 ఛార్జీ ఉండాలి, కానీ ఈ సంస్థలు కనీసం రూ.100 వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు రాగా 2022లో ఆయా సంస్థల నేతృత్వంలో పని చేస్తున్న ఆటోరిక్షాలపై ప్రభుత్వం నిషేధం విధించగా.. తాజాగా బైక్ ట్యాక్సీలపై కర్ణాటక హైకోర్ట్ నిషేధం విధించింది. మరోవైపు తెల్ల నంబర్ ప్లేట్లు కలిగిన టూవీలర్స్ వాణిజ్యపరంగా వినియోగానికి అనుమతి లేదు కాబట్టి.. బైక్ టాక్సీలు చట్టవిరుద్ధమని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగేటర్ల సేవలను వ్యతిరేకించింది. అందువల్ల దీనికి సరైన చట్టబద్ధత అవసరమని కోర్టు అభిప్రాయపడింది. టూవీలర్లకు రవాణా వాహనాలుగా గుర్తించటం లేదా వాటికి కాంట్రాక్ట్ క్యారియర్ పర్మిషన్లు ఇచ్చేలా తాము రవాణా శాఖను ఆదేశించలేమని, దీనికి సరైన చట్టం అవసరమని జస్టిస్ బీఎం శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు.