పాఠ‌శాల హెడ్‌మాస్ట‌ర్‌ను క‌ర్ర‌ల‌తో చిత‌క్కొట్టిన విద్యార్థినులు

Karnataka Headmaster Thrashed By Schoolgirls For Harassing Minor.విద్యార్థినుల‌కు అండ‌గా ఉండాల్సిన ప్ర‌ధానోపాధ్యాయుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Dec 2022 11:49 AM GMT
పాఠ‌శాల హెడ్‌మాస్ట‌ర్‌ను క‌ర్ర‌ల‌తో చిత‌క్కొట్టిన విద్యార్థినులు

విద్యార్థినుల‌కు అండ‌గా ఉండాల్సిన ప్ర‌ధానోపాధ్యాయుడు దారి త‌ప్పాడు. హాస్ట‌ల్‌లో ఉంటున్న విద్యార్థినుల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. కొన్నాళ్లు పాటు అత‌డి ఆగ‌డాల‌ను భ‌రించిన విద్యార్థినులు తిరగ‌బ‌డ్డారు. కర్ర‌ల‌తో స‌ద‌రు ప్ర‌ధానోపాధ్యాయుడికి బుద్ధి చెప్పారు. క‌ర్ణాట‌క రాష్ట్రంలోని శ్రీరంగ‌ప‌ట్నంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. విద్యార్థినులు హెడ్‌మాస్ట‌ర్‌ను క‌ర్ర‌ల‌తో కొడుతున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

క‌ట్టేరి అనే గ్రామంలోని ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌లో ఆనంద‌మూర్తి అనే వ్య‌క్తి ప్ర‌ధానోపాధ్యాయుడిగా ప‌ని చేస్తున్నాడు. హాస్ట‌ల్‌లో ఉన్న మైన‌ర్ విద్యార్థినుల్లో ఒక‌రితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆ బాలిక ఏడుస్తూ వెళ్లి విష‌యాన్ని మిగ‌తా విద్యార్థినుల‌కు తెలియ‌జేసింది. విష‌యం తెలిసి విద్యార్థినులు ఆగ్ర‌హంతో ఊగిపోయారు.

క‌ర్ర‌ల‌ను చేత‌బ‌ట్టుకుని ప్ర‌ధానోపాధ్యాయుడి గ‌దికి వెళ్లారు. ఘ‌ట‌న‌పై అత‌డిని నిల‌దీశారు. అత‌డు విద్యార్థినుల‌ను త‌ప్పించుకుని వేరే గ‌దిలోకి వెళ్లి త‌లుపులు వేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఇది గ‌మ‌నించిన వారు అత‌డి ప్ర‌య‌త్నాన్ని అడ్డుకుని అత‌డిని క‌ర్ర‌ల‌తో చిత‌క‌బాదారు. అక్క‌డ ఉన్న ప‌లువురు విద్యార్థినుల‌ను స‌ముదాయించేందుకు ప్ర‌య‌త్నించినా వారు మాట విన‌లేదు. గ‌త కొంత‌కాలంగా అత‌డు త‌మ‌ను వేదిస్తున్న‌ట్లు విద్యార్థినులు తెలిపారు.

పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని అత‌డి అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినుల ఫిర్యాదు మేర‌కు ఫోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story