కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుండి 14 రోజుల పాటూ కర్ణాటక లాక్ డౌన్ అంచున ఉండనుంది. కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగా లాక్ డౌన్ ను అనౌన్స్ చేసింది ప్రభుత్వం. 27 వ తేదీ సాయంత్రం నుండి 14 రోజుల పాటూ కర్ణాటకలో లాక్ డౌన్ అమలులో ఉండనుంది. ఎసెన్షియల్ సర్వీసులు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకూ మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. మిగిలిన షాపులన్నీ మూసివేయనున్నారు.
ఆదివారం ఒక్కరోజే 35000కు పైగా కేసులు నమోదవ్వడంతో కర్ణాటక ప్రభుత్వం కరోనాను కట్టడి చేయడానికి లాక్ డౌన్ ను అనౌన్స్ చేసింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ, బెంగళూరు మెట్రో సేవలను కూడా నిలిపివేయనున్నారని ప్రభుత్వం తెలిపింది. కరోనా కట్టడి చేయాలంటే ప్రజలందరూ సహకరించాలని కర్ణాటక ప్రభుత్వం కోరింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి అమల్లోకి రానుంది. 14 రోజుల పాటు కొనసాగుతుంది. వచ్చేనెల 10వ తేదీ తెల్లవారు జామున 6 గంటల వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్ సందర్భంగా ఎలాంటి వ్యాపార కార్యకలాపాలకు అవకాశం ఇవ్వలేదు. అత్యవసర సర్వీసులు మినహా మరెలాంటి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు అందుబాటులో ఉండబోవని తెలిపింది.
ఆదివారం నాడు కర్ణాటకలో 35 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క బెంగళూరులోనే వాటి సంఖ్య 20 వేలకు పైగా ఉంటోంది. కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్యను తగ్గించే దిశగా బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం తొలుత రాత్రివేళ కర్ఫ్యూను అమల్లోకి తీసుకొచ్చింది. అనంతరం వీకెండ్ లాక్‌డౌన్‌ను విధించింది. 24, 25 తేదీల్లో కర్ణాటక వ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ కొనసాగింది. ఇప్పుడు 14 రోజుల పాటూ పూర్తీ లాక్ డౌన్ ను ప్రకటించింది.