పిల్లలు పూలు కోశారని.. అంగన్వాడీ కార్యకర్తపై దాడి

కర్నాటకలోని బెలగావిలో అంగన్‌వాడీ కేంద్రంలోని కొందరు చిన్నారులు ఇరుగుపొరుగు ఇంటి నుంచి పూలు తెంపడంతో ఓ అంగన్‌వాడీ వర్కర్‌పై దాడి జరిగింది.

By అంజి  Published on  4 Jan 2024 10:06 AM IST
Karnataka, Anganwadi worker, Belagavi

పిల్లలు పూలు కోశారని.. అంగన్వాడీ కార్యకర్తపై దాడి

కర్నాటకలోని బెలగావిలో అంగన్‌వాడీ కేంద్రంలోని కొందరు చిన్నారులు ఇరుగుపొరుగు ఇంటి నుంచి పూలు తెంపడంతో ఓ అంగన్‌వాడీ వర్కర్‌పై దాడి జరిగింది. అంగన్‌వాడీ కేంద్రంలో హెల్పర్‌గా పనిచేస్తున్న సుగంధ మోరే (50)ను పొరుగింటి యజమాని అంగన్వాడీ పిల్లలు పూలు తెంపుతున్నారని ఆరోపించింది. ఈ సంఘటన జనవరి 1వ తేదీ సోమవారం జరిగింది. పిల్లలు చేసిన పనికి కోపోద్రిక్తులైన ఇంటి యజమాని కల్యాణి.. సుగంధను కొట్టి ఆమె ముక్కును కూడా ఛిద్రం చేసింది.

ఆమె ఆసుపత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. గాయం యొక్క దృశ్యాలు పొరుగువారి దాడి యొక్క క్రూరత్వాన్ని చూపాయి. ఈ ఘటన కర్ణాటక కేబినెట్‌లోని మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ సొంత జిల్లా బెల్గావిలోని బసుర్తే గ్రామంలో జరిగింది. ఈ ఘటనపై కాకతి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమె ఇప్పటి వరకు పట్టుబడలేదు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story