కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. క‌పిల్ సిబ‌ల్ రాజీనామా

Kapil Sibal resigns congress party.కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ త‌గిలింది. సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి, గాంధీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 May 2022 7:52 AM GMT
కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. క‌పిల్ సిబ‌ల్ రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ త‌గిలింది. సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి, గాంధీ కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడు అయిన క‌పిల్ సిబల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను పార్టీని వీడుతున్న‌ట్లు ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అంతేకాదు స‌మాజ్ వాదీ పార్టీ మ‌ద్ద‌తుతో ఆయ‌న రాజ్య‌స‌భ స్థానానికి నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

అనంత‌రం క‌పిల్ సిబల్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఈ నెల 16 నే రాజీనామా చేసిన‌ట్లు తెలిపారు. తాను స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా రాజ్య‌స‌భ‌కు నామినేష‌న్ దాఖ‌లు చేశాన‌ని చెప్పారు. స‌మాజ్‌వాదీ పార్టీ త‌న‌కు మ‌ద్ద‌తిస్తోంద‌న్నారు. పార్ల‌మెంట్‌లో ఇండిపెండెంట్ వాయిస్ అవ‌స‌రం ఎంతో ఉంద‌ని, ఇలా స్వ‌తంత్ర స‌భ్యుడు ఏదైనా అంశాన్ని లేవ‌దీస్తే ప్ర‌జ‌లు కూడా న‌మ్ముతార‌ని సిబాల్ అన్నారు.

నామినేష‌న్ దాఖ‌లు చేసే సమ‌యంలో క‌పిల్ సిబాల్ వెంట స‌మాజ్‌వాదీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్‌, ఆ పార్టీ సీనియ‌ర్ నేత రాంగోపాల్ యాద‌వ్ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. అతి త్వ‌ర‌లోనే ఆయ‌న స‌మాజ్‌వాదీ స‌భ్య‌త్వాన్ని కూడా తీసుకోనున్నారు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీలో సంస్థాగ‌త మార్పుల‌పై పార్టీ సీనియ‌ర్ నేత అయిన క‌పిల్ సిబ‌ల్ బ‌హిరంగంగానే త‌న గ‌ళాన్ని వినిపించారు. కాంగ్రెస్ రెబ‌ల్‌గా మారిన జీ-23 బృందంలోనూ క‌పిల్ సిబ‌ల్ ఉన్నారు. కాగా.. క‌పిల్ రాజీనామాపై కాంగ్రెస్ ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు.

Next Story
Share it