మహిళా డ్రైవర్‌కు కారును బహుమతిగా ఇచ్చిన కమల్ హాసన్
డీఎంకే ఎంపీ కనిమొళి ఇటీవల కోవైలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ మహిళ డ్రైవర్ బస్‌లో ప్రయాణించారు. అదే బస్సులో కండక్టర్‌గా
By అంజి Published on 26 Jun 2023 10:18 AM GMTమహిళా డ్రైవర్‌కు కారును బహుమతిగా ఇచ్చిన కమల్ హాసన్
డీఎంకే ఎంపీ కనిమొళి ఇటీవల కోవైలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ మహిళ డ్రైవర్ బస్‌లో ప్రయాణించారు. అదే బస్సులో కండక్టర్‌గా పనిచేస్తున్న ట్రైనీ కండక్టర్ అన్నాతై కనిమొళిని.. ఆమె వెంటన వచ్చినవారి టికెట్ అడిగారు. దీంతో బస్సు డ్రైవర్ ఎంపీ కనిమొళికి టికెట్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఈక్రమంలో డ్రైవర్ షర్మిలకు.. కండక్టర్ కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు సదరు ట్రావెల్స్ యాజమాన్యం బస్సు డ్రైవర్‌ని విధుల నుండి తొలగించింది. ఈ వివాదంపై తాజాగా ప్రముఖ నటుడు, ఎంఎన్‌ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ స్పందించారు. ఉద్యోగం కోల్పోయిన ఆ మహిళా డ్రైవర్‌కు ఓ కారును గిఫ్ట్‌గా అందజేస్తున్నట్లు ప్రకటించారు.
ఇప్పటివరకు ఉద్యోగిగా ఉన్న మహిళ డ్రైవర్ షర్మిల.. ఇకపై ఎంతో మందికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని కమల్ ఆకాంక్షించారు. కొయంబత్తూరు తొలి మహిళా బస్సు డ్రైవర్ షర్మిల అంశం వివాదంగా మారడం తనను ఎంతగానో బాధించిందని కమల్ అన్నారు. ఆమె.. ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కన్నారు. షర్మిల కేవలం డ్రైవర్‌గానే మిగిలిపోకూడదని, ఎంతో మంది షర్మిలలను సృష్టించాలనేది తన విశ్వాసమని చెప్పారు. కమల్ కల్చరల్ సెంటర్ తరఫున షర్మిలకు కారును అందజేస్తున్నామని తెలిపారు. కేవలం క్యాబ్ సర్వీసులకే కాకుండా, మరెంతో మందికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు ఈ కారును వినియోగించుకోవచ్చని కమల్ హాసన్ పేర్కొన్నారు.