52వ సీజేఐగా జస్టిస్ బీఆర్.గవాయ్ ప్రమాణస్వీకారం..ఆ రెండో వ్యక్తిగా రికార్డు

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 52వ సీజేఐగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు.

By Knakam Karthik
Published on : 14 May 2025 11:23 AM IST

National News, Supreme Court, Justice Br Gavai, Chief Justice of India, 52nd Chief Justice of India

52వ సీజేఐగా జస్టిస్ బీఆర్.గవాయ్ ప్రమాణస్వీకారం..ఆ రెండో వ్యక్తిగా రికార్డు

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 52వ సీజేఐగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు తదితరులు హాజరయ్యారు.

సీజేఐ గా మంగళవారం రిటైర్ అయిన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్థానంలో జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఈ బాధ్యతలు స్వీకరించారు. ఈయన 23 నవంబర్ 2025న పదవీ విరమణ చేసే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా దేశ న్యాయ వ్యవస్థ అత్యున్నత పీఠాన్ని అధిష్టించిన మొదటి బౌద్ధ సీజేఐగా , జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ రికార్డులకెక్కారు.

జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 1985లో లా ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత, భోసలే వంటి సీనియర్ న్యాయవాదులతో కలిసి పనిచేశారు. అనతికాలంలోనే స్వతంత్రంగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఆయన మునిసిపల్ కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిల్‌గా ఉన్నారు.

Next Story