కుంగుతున్న జోషి మఠ్.. ఆదుకోడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వం

Joshimath Sinking Live Updates. ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ కుంగుతూ ఉండడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే..!

By M.S.R  Published on  11 Jan 2023 4:38 PM IST
కుంగుతున్న జోషి మఠ్.. ఆదుకోడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వం

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ కుంగుతూ ఉండడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే..! ఎంతో మంది నిరాశ్రయులు అవుతూ వస్తున్నారు. అక్కడ ఉండాలంటే భయపడుతూ ఉన్నారు. దీంతో బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.1.5లక్షలు అందించనున్నట్లు.. బుధవారం ముఖ్యమంత్రి పుష్కరసింగ్‌ ధామీ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.

జోషిమఠ్ టౌన్ ఏటా ఆరున్నర సెంటీమీటర్లు భూమిలోకి కుంగిపోతోందని.. చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కుంగిపోతున్నాయని తాజా నివేదిక పేర్కొంది. ఈమేరకు రెండేళ్ల పాటు జరిగిన పరిశోధనలో ఉపగ్రహ చిత్రాలను పరిశీలించి ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్ఎస్) పరిశోధకులు వెల్లడించారు. టెక్టానిక్ ప్లేట్ల కదలికల్లో మార్పుల వల్లే జోషిమఠ్ ప్రాంతం కుంగిపోతోందని పరిశోధకులు చెప్పారు. దీంతో ఇళ్లు, రోడ్లు సహా ఇతర కట్టడాలకు పగుళ్లు వస్తున్నాయని అన్నారు. జోషిమఠ్ లో పగుళ్లు వచ్చిన పలు ఇళ్లు, హోటళ్లను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రమాదకరంగా మారిన పలు కట్టడాలను మంగళవారం నిపుణుల బృందం గుర్తించింది. పట్టణంలో మొత్తంగా దాదాపు 4,500 భవనాలు ఉండగా.. ఇప్పటివరకు 723భవనాలకు పగుళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 131 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు.


Next Story