తమిళనాడు ఎన్నికల్లో ఇటీవలే అన్నాడీఎంకే ఓటమి చెందిన సంగతి తెలిసిందే.! కరుణానిధి, జయలలిత వంటి నేతలు లేకుండా మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్టాలిన్ కే పట్టం కట్టారు. అన్నాడీఎంకే ఓటమి చెందడంతో కొందరు నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. శశికళను అన్నాడీఎంకే లో తీసుకుని ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెబుతూ ఉన్నారు. ఇక తాజాగా శశికళకు మద్దతుగా అన్నాడీఎంకే తరఫున పోస్టర్లు వెలిశాయి. దీంతో అన్నాడీఎంకే పార్టీ వర్గాల్లో సంచలనం కలిగించాయి.
ఈ పోస్టర్లు ముఖ్యంగా చెన్నై ప్రధాన కార్యాలయం ఎదుట, పుదుక్కోట్టై ప్రాంతంలో అతికించడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు ముగిసిన తర్వాత అన్నాడీఎంకే ప్రతిపక్షనేత పదవికి తీవ్ర పోటీ నెలకొనగా.. ఎప్పటి లాగే ఓపీఎస్ తరఫున ఒక వర్గం, ఎడపాడి పళనిసామి వర్గం పోరాడుతూ ఉంది. ఇరు వర్గాలు కూడా తమకు దక్కలంటే.. తమకు దక్కాలని గొడవ పడుతూ ఉన్నారు. అన్నాడీఎంకే నేతలు ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు.
ఇంతలో శశికళ పోస్టర్లు పెద్ద ఎత్తున కనిపించడంతో అన్నాడీఎంకేలో టెన్షన్ మొదలవుతోంది. చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ఎదురుగా శశికళకు మద్దతు తెలుపుతూ వీలిసిన పోస్టర్లు ఎవరు అతికించారా అని కూడా తెలియాల్సి ఉంది. ఎంజీఆర్ రూపొందించిన, జయలలిత కాపాడిన పార్టీని శశికళ ఆధ్వర్యంలో నడిపిద్దామని అందులో రాశారు.