దేశ వ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం.. యూజర్లకు తప్పని తిప్పలు

Jio users are unable to make calls, send messages across India. ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్‌ జియో సేవలు భారతదేశంలో మంగళవారం అంతరాయాన్ని

By అంజి  Published on  29 Nov 2022 5:40 AM GMT
దేశ వ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం.. యూజర్లకు తప్పని తిప్పలు

ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్‌ జియో సేవలు భారతదేశంలో మంగళవారం అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. చాలా మంది వినియోగదారులు ఉదయం నుండి కాల్‌లు చేయలేకపోతున్నారని సోషల్ మీడియాలో రిపోర్ట్ చేశారు. కొంతమంది వినియోగదారులు ఉదయం నిద్ర లేవగానే మెసేజ్‌లు పంపలేకపోయామని చెప్పారు. యూజర్లు కాలింగ్‌, మెసేజింగ్‌ వరకు పలు సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే మొబైల్ డేటా సేవలకు ఎలాంటి అంతరాయం లేనప్పటికీ ఫోన్స్‌ కాల్స్‌ చేయలేకపోయారు. కాలింగ్, ఎస్‌ఎమ్‌ఎస్‌ సేవలు మాత్రమే ప్రభావితమయ్యాయి. గతంలోనూ పలు సందర్భాల్లో జియో సేవలు నిలిచిపోయాయి.

ఓ ట్విటర్‌ యూజర్‌.. ''ఉదయం నుండి వోల్ట్‌ సింబల్‌ లేదు. ఏ కాల్స్ చేయలేకపోయాను. సాధారణ కాల్‌లకు సమస్యలు ఉన్నప్పుడు మీరు 5g సేవలను అందించడానికి ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారా?" అని వ్రాశాడు. అయితే సోమవారం రాత్రి నుంచే సేవలను నిలిచిపోయాయని పలువురు యూజర్లు తెలిపారు. కొంతమంది యూజర్లు ఇంటర్నెట్ సేవలను కూడా ఉపయోగించలేకపోయారు. అయితే కొంతమందికి ఇది పని చేసింది. జియో నెట్‌ వర్క్‌ సంస్థ ఇంకా ఈ అంతరాయాన్ని పరిష్కరించలేదు.

డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. అంతరాయాలను ట్రాక్ చేసే వెబ్‌సైట్, జియో భారతదేశంలోని చాలా మంది యూజర్లకు ఉదయం 6 నుండి 9 గంటల మధ్య పని చేయడం ఆపివేసింది. 37 శాతం మంది వినియోగదారులు సిగ్నల్ పొందడం లేదని ఫిర్యాదు చేశారని, 37 శాతం మంది వినియోగదారులు కాల్స్ మరియు సందేశాలు పంపలేకపోయారని, మిగిలిన 26 శాతం మంది వినియోగదారులు మొబైల్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయలేకపోతున్నారని వెబ్‌సైట్ తెలిపింది. జియో అంతరాయం ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా సహా ఇతర నగరాలపై ప్రభావం చూపింది.




Next Story