ఝాన్సీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. రక్షించబడిన ముగ్గురు శిశువులు అనారోగ్యంతో మృతి
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదంలో రక్షించబడిన ముగ్గురు శిశువులు చికిత్స పొందుతూ అస్వస్థతకు గురై మరణించారు.
By అంజి Published on 21 Nov 2024 2:06 AM GMTఝాన్సీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. రక్షించబడిన ముగ్గురు శిశువులు అనారోగ్యంతో మృతి
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదంలో రక్షించబడిన ముగ్గురు శిశువులు చికిత్స పొందుతూ అస్వస్థతకు గురై మరణించినట్లు వైద్యుడు తెలిపారు. వైద్య కళాశాల డీన్ డాక్టర్ నరేంద్ర సెంగార్ ఈ పరిణామాన్ని ధృవీకరించారు. గత 24 గంటల వ్యవధిలో ముగ్గురు శిశువులు అనారోగ్యంతో మరణించారు. ఈ శిశువులలో ఒకరు శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగిన 36 గంటల తర్వాత తన తల్లితో తిరిగి కలిశారు.
"శుక్రవారం అగ్నిప్రమాదంలో మొత్తం 39 మంది పిల్లలు రక్షించబడ్డారు. 10 మంది పిల్లలు కాలిన గాయాలతో మరణించారు. రక్షించబడిన వారిలో, ఐదుగురు పిల్లలు అనారోగ్యంతో మరణించారు. ఈ రోజు ముగ్గురు పిల్లలు మరణించారు" డాక్టర్ సెంగార్ చెప్పారు. "వారి కాలిన గాయాలకు మరణాలకు ఎటువంటి సంబంధం లేదు. వారికి ఎటువంటి కాలిన గాయాలు లేవు. వారికి ఎటువంటి పొగ ప్రభావం లేదు. ఈ రోజు మరణించిన పిల్లలు అనారోగ్యంతో మరణించారు" అన్నారు.
ముగ్గురు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వైద్య కళాశాలలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసియు)లో శుక్రవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరో 16 మందికి గాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని జిల్లా మేజిస్ట్రేట్ అవినాష్ కుమార్ సూచించారు. అగ్నిమాపక సిలిండర్లపై ఫిల్లింగ్ తేదీ 2019 అని, గడువు 2020 అని ప్రాథమిక విచారణలో తేలింది. మంటలు చెలరేగిన తర్వాత, ఫైర్ అలారం కూడా మోగలేదు.
శుక్రవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో వార్డులో మంటలు చెలరేగడంతో ఆస్పత్రిలో తొక్కిసలాటలాంటి పరిస్థితి నెలకొంది. మంటలను ఆర్పేందుకు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. నవజాత శిశువులను ఉంచిన వార్డులోని పరికరాలు పూర్తిగా కాలిపోయినట్లు దృశ్యాలు చూపించాయి. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.