ఎట్టకేలకు స్పందించిన జెమీమా తండ్రి

ఖార్ జింఖానాలో మతమార్పిడులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ ఎట్టకేలకు స్పందించారు.

By Kalasani Durgapraveen  Published on  26 Oct 2024 3:48 AM GMT
ఎట్టకేలకు స్పందించిన జెమీమా తండ్రి

ఖార్ జింఖానాలో మతమార్పిడులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ ఎట్టకేలకు స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఒక ప్రకటన విడుదల చేశారు. తాను చేపట్టిన సమావేశాలు ఖార్ జింఖానా నిబంధనలకు ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాయని, మత మార్పిడులకు ఎటువంటి సంబంధం లేదని రోడ్రిగ్స్ చెప్పారు.

తాము ఏప్రిల్ 2023 నుండి ఒక సంవత్సరం పాటు అనేక సందర్భాలలో ప్రార్థన సమావేశాల ప్రయోజనం కోసం ఖార్ జింఖానాలో సౌకర్యాలను పొందామని తెలిపారు. ఇది ఖార్ జింఖానాలో అమలులో ఉన్న నిబంధనలు పాటించే జరిగాయని తెలిపారు. మీడియా కథనాలలో వచ్చినట్లుగా తాము మత మార్పిడి సమావేశాలు నిర్వహించలేదన్నారు. ప్రార్థన సమావేశాలను నిర్వహించడం ఆపమని మాకు చెప్పినప్పుడు, మేము జింఖానా నిర్ణయాన్ని గౌరవించి వెంటనే ఆపివేశామన్నారు. అంతేకాకుండా మేము వెంటనే బకాయిలను క్లియర్ చేసామన్నారు. తాము చట్టాన్ని గౌరవించే వ్యక్తులమని, ఎవరికీ అసౌకర్యం కలిగించకుండా మా విశ్వాసాన్ని ఆచరించడానికి సిద్ధంగా ఉంటామన్నారు.

భారత మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ సభ్యత్వాన్ని ఇటీవల ఖార్ జింఖానా రద్దు చేసింది. జింఖానా వార్షిక సాధారణ సమావేశం (AGM) సందర్భంగా ఆమె తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ సభ్యత్వ హక్కులను దుర్వినియోగం చేయడంపై పలువురు సభ్యుల ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నారు.


Next Story