కశ్మీర్ లోయల్‌లో కరుడుగట్టిన, భయంకరమైన ఉగ్రవాది, జైష్ ఇ మొహ్మద్ టెర్రరిస్ట్ సజ్జాద్ అఫ్ఘని ని భద్రతా దళాలు మట్టుబెట్టి ఇండియన్ ఆర్మీకి, జమ్మూకశ్మీర్ పోలీసులకు అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని సోఫియాన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సోఫియాన్‌లో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న ఇండియన్ ఆర్మీ, స్థానిక పోలీసులు.. సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఉగ్రవాదులను గుర్తించిన భద్రతా బలగాలు, వారిపై కాల్పులు జరిపాయి.
అయితే ఉగ్రవాదులు కూడా ప్రతిగా కాల్పులు జరుపడంతో అక్కర భీకర యుద్ధ వాతావరం ఏర్పడింది. తీవ్రవాదులు తప్పించుకుని వెళ్లిపోకుండా ఆ ప్రాంతాన్ని భారత సైన్యం చుట్టుముట్టింది. ఆదివారం నాడు స్థానిక లష్కర్ తీవ్రవాది జహంగీర్ అహ్మద్ ను తుదముట్టాయి భద్రతా దళాలు. మూడు రోజులుగా సాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో కీలక టెర్రరెస్ట్ సజ్జాద్ అఫ్ఘని సహా ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదులను చంపినట్లుగా భద్రతా దళాలు ధృవీకరించాయి. ఉగ్రవాదుల నుంచి ఎం-4 రైఫిళ్లను సైన్యం స్వాధీనం చేసుకుంది. శనివారం నాడు కార్డాన్ సెర్చ్ జరుపుతూ ఉండగా.. ఎన్ కౌంటర్ మొదలైంది.
కొద్ది రోజుల క్రితం కశ్మీర్‌లోని సోపోర్‌లోనూ కీలక ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. సోపోర్‌లో ఉగ్రవాదులు-భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాద సంస్థ అల్ బదర్ చీఫ్ గ్యానీ ఖ్వాజాను భద్రతా దళాలు హతమార్చాయి.