ఎన్డీఏ కూట‌మిలో చేరిన‌ జేడీఎస్

కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి

By Medi Samrat  Published on  22 Sept 2023 5:11 PM IST
ఎన్డీఏ కూట‌మిలో చేరిన‌ జేడీఎస్

కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమై అధికారికంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)లో చేరారు. ఈ భేటీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా పాల్గొన్నారు.

భేటీపై JP నడ్డా Xలో స్నందిస్తూ.. "JD(S) ఎన్డీఏ కూటమిలో భాగం కావాలని నిర్ణయించుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. NDAలోకి వారిని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. ఈ నిర్ణ‌యం ప్రధానమంత్రి న్యూ ఇండియా, స్ట్రాంగ్ ఇండియా విజన్‌ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ.. జేడీ(ఎస్)తో క‌లిసే అవ‌కాశం ఉంద‌ని ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్ యడియూరప్ప చెప్పినప్పటి నుంచి రెండు పార్టీల మధ్య పొత్తు విష‌య‌మై వార్త‌లు వ‌స్తున్నాయి. మొత్తం 28 నియోజకవర్గాలు ఉన్న కర్ణాటకలో జేడీఎస్ నాలుగు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది.

కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా.. స్వతంత్ర అభ్యర్థి (మాండ్యా నుంచి సుమలత అంబరీష్) ఒక స్థానంలో గెలిచారు. కాంగ్రెస్, జేడీ(ఎస్) ఒక్కో సీటు గెలుచుకున్నాయి. ఈ ఏడాది మేలో 224 మంది సభ్యులున్న అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 135 స్థానాలు కైవసం చేసుకోగా, బీజేపీ 66, జేడీ(ఎస్‌) 19 స్థానాల్లో గెలుపొందాయి.

Next Story