ఈ జవాను పరుగు రికార్డు కోసం..

Army Jawan name in Guinness book. తన పేరును గిన్నీస్‌ బుక్‌ ఆప్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో ఉండడానికి జవాను 50 రోజుల్లో ఏకంగా 4,300 కిలోమీటర్ల మేర కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పరుగెత్తాలని నిశ్చయించుకున్నాడు..

By Medi Samrat  Published on  4 April 2021 3:47 AM GMT
Army Jawan  walk from kashmir to Kanyakumari

ఎవరో ఇచ్చిన పుట్టిన రోజు కానుక కంటే మనకి మనం ఇచ్చుకొనే కానుక ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. తన పేరును గిన్నీస్‌ బుక్‌ ఆప్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చేర్చి 30వ పుట్టిన రోజును జీవితాంతం గుర్తుంచుకునే విధంగా ఏదైనా చేయాలనుకున్నాడో జవాను. ఇందులో భాగంగా తనకు ఇష్టమైన పరుగునే ఎంచుకున్నాడు. కేవలం 50 రోజుల్లో ఏకంగా 4,300 కిలోమీటర్ల మేర కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పరుగెత్తాలని నిశ్చయించుకున్నాడు.

ఈనెల 21న పుట్టిన రోజును జరుపుకోనున్న పి. నాయక్‌ వేలు.. 60 పారా ఫీల్డ్‌ హాస్పిటల్‌లో నర్సింగ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నాయక్‌ శుక్రవారం సహచరుల కరతాల ధ్వనుల మధ్య శ్రీనగర్‌లోని 92 బేస్‌ హాస్పిటల్‌ నుంచి తన పరుగును ఆరంభించారు. నాయక్‌ పరుగుకు మద్దతు తెలుపుతూ పలువురు ఔత్సాహికులు జాతీయ జెండాతో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ఆయనతో పరుగు తీశారు. ఇంత భారీ దూరాన్ని దాటాలంటే ప్రధాన నగరాలు, పట్టణాలు, రాష్ట్రాల మీదుగా వేలు రోజూ 70-100 కిలోమీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది.

తమిళనాడులోని కృష్ణగిరిలో 1991, ఏప్రిల్‌ 21న వేలు జన్మించారు. స్వరాష్ట్రం తరఫున 13 ఏళ్లకే అథ్లెటిక్స్‌లో ప్రాతినిథ్యం వహించిన ఆయన, 2011 డిసెంబరులో సైన్యంలో చేరారు. గతేడాది జూన్‌లో కేవలం 1,600 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 17 రోజుల్లోనే పరుగెత్తిన మొదటి అల్ట్రా రన్నర్‌గా నాయక్‌కు పేరుంది. ఈ ఫీట్‌ తో ఆసియన్‌ రికార్డులో చేరే అవకాశం ఉంది.




Next Story