జమ్మూలో విషాదం..ఆకస్మిక వరదలకు ముగ్గురు బలి

జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలోని చీనాబ్ నదికి సమీపంలో ఉన్న ధరమ్‌కుండ్ గ్రామంలో రాత్రిపూట కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి.

By Knakam Karthik
Published on : 20 April 2025 2:40 PM IST

National News, Jammu kashmir, Ramban District, Flash Floods,

జమ్మూలో విషాదం..ఆకస్మిక వరదలకు ముగ్గురు బలి

జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలోని చీనాబ్ నదికి సమీపంలో ఉన్న ధరమ్‌కుండ్ గ్రామంలో రాత్రిపూట కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఒకరు గల్లంతయ్యారు. కొండచరియలు విరిగిపడటం, వడగళ్ల వానలు మరియు తీవ్రమైన గాలులతో కూడిన ఈ ప్రకృతి వైపరీత్యం ఆస్తి, మౌలిక సదుపాయాలకు విస్తృత నష్టం కలిగించింది.

స్థానిక అధికారుల ప్రకారం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సమీపంలోని నల్లాలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగి, చీనాబ్ వంతెన సమీపంలోని ధరంకుండ్ గ్రామాన్ని ముంచెత్తిన వరదగా మారింది. పది ఇళ్ళు పూర్తిగా ధ్వంసమయ్యాయి, మరో 25 నుండి 30 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విధ్వంసం జరిగినప్పటికీ, ధరమ్‌కుండ్ పోలీసులు, జిల్లా యంత్రాంగం త్వరితగతిన స్పందించడంతో ప్రభావిత ప్రాంతంలో చిక్కుకున్న దాదాపు 90 నుండి 100 మందిని సురక్షితంగా తరలించారు. మృతులను బాగ్నా పంచాయతీ నివాసితులు మొహమ్మద్ అకిబ్ (14), మొహమ్మద్ సాకిబ్ (9), మోహన్ సింగ్ (75) గా గుర్తించారు. ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సింగ్ తెలిపారు.

ముఖ్యంగా లోయ ప్రాంతానికి ప్రధాన రహదారిగా ఉన్న జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మూతపడటం, ఇతర ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి నష్రీ, బనిహాల్ మధ్య దాదాపు డజనుకు పైగా కొండచరియలు విరిగిపడ్డాయి. విపత్తు కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలలో అనేక చెట్లు నేలకూలాయి.

Next Story