బస్సు అగ్నిప్రమాదాలపై కేంద్రం సీరియస్..జేసల్మేర్, కర్నూలు ఘటనల్లో విస్తుపోయే నిజాలు
జేసల్మేర్ - జోధ్‌పూర్ మరియు కర్నూలు - బెంగళూరు బస్సు అగ్నిప్రమాదాల ఘటనలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది
By - Knakam Karthik |
బస్సు అగ్నిప్రమాదాలపై కేంద్రం సీరియస్..జేసల్మేర్, కర్నూలు ఘటనల్లో విస్తుపోయే నిజాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన జేసల్మేర్ - జోధ్‌పూర్ మరియు కర్నూలు - బెంగళూరు బస్సు అగ్నిప్రమాదాల ఘటనలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ప్రమాదాలకు సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ప్రమాదాల్లో నిబంధనల ఉల్లంఘనలే ప్రధాన కారణమని దర్యాప్తులో తేలినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రమాదానికి గురైన స్లీపర్ కోచ్ బస్సు అనుమతించిన పొడవు కంటే ఎక్కువగా ఉందని గుర్తించారు. అత్యవసర ద్వారాలు ఉండాల్సిన కొలతల్లో లేకపోవడమే కాకుండా, ప్రయాణికుల సీట్లు ఆ దారికి అడ్డుగా ఉన్నాయని తేలింది. నిబంధనల ప్రకారం రెండు రూఫ్ హ్యాచ్‌లు ఉండాలి, కానీ ఆ బస్సులో ఒకటి మాత్రమే ఉంది. జైసల్మేర్ నుండి జోధ్‌పూర్ మార్గంలో జరిగిన స్లీపర్ కోచ్ అగ్నిప్రమాదంలో, బస్సు పొడవు అనుమతించదగిన పరిమితికి మించి ఉందని, అత్యవసర తలుపులు కనీస డైమెన్షనల్ అవసరాలను తీర్చలేదని, ప్రయాణీకుల సీట్లు అత్యవసర తలుపుకు వెళ్లడానికి అడ్డుగా ఉన్నాయని, రెండు రూఫ్ హాచ్‌లకు బదులుగా ఒక రూఫ్ హాచ్ మాత్రమే అందించబడిందని, నిచ్చెనతో కూడిన రూఫ్ లగేజ్ క్యారియర్ అందించబడిందని, డ్రైవర్ క్యాబిన్ విభజన ఉందని మరియు సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (CMVR) 1989 అవసరాల ప్రకారం అగ్ని గుర్తింపు మరియు అణచివేత వ్యవస్థను అమర్చలేదని గుర్తించింది.
కర్నూలు - బెంగళూరు హైవేపై జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి రిజిస్ట్రేషన్ లోపాలు ఉన్నట్లు తెలిపింది. ఈ బస్సు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లో కేవలం 'సీటింగ్ కెపాసిటీ మాత్రమే పేర్కొన్నట్లు కేంద్రం వెల్లడించింది. కర్నూలు సమీపంలో బైక్‌ను ఢీకొట్టిన సమయంలో చెలరేగిన మంటలు, డోర్లు జామ్ కావడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారని ప్రాథమిక సమాచారం.