జైలులో ఉన్నా కూడా 28000 ఓట్ల తేడాతో గెలిచాడు.!

జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు అనంత్ సింగ్, జన్ సురాజ్ పార్టీ (జెఎస్పి) మద్దతుదారుడి హత్య కేసులో అరెస్టు అయి ప్రస్తుతం జైలులో ఉన్నాడు.

By -  Medi Samrat
Published on : 14 Nov 2025 6:47 PM IST

జైలులో ఉన్నా కూడా 28000 ఓట్ల తేడాతో గెలిచాడు.!

జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు అనంత్ సింగ్, జన్ సురాజ్ పార్టీ (జెఎస్పి) మద్దతుదారుడి హత్య కేసులో అరెస్టు అయి ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అయినా మోకామాలో 28,000 కంటే ఎక్కువ ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అనంత్ సింగ్ తన సమీప ప్రత్యర్థి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి)కి చెందిన వీణా దేవిని 28,000 కంటే ఎక్కువ ఓట్లతో ఓడించారు. అనంత్ సింగ్ ప్రత్యర్థి 'బాహుబలి' సూరజ్‌భన్ సింగ్ భార్య వీణా దేవి.

జైలులో ఉన్న జెడి(యు) నాయకుడు, మోకామా సీటు నుండి ఐదుసార్లు గెలిచాడు. అతనిపై 28 క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఆయుధ కేసులో దోషిగా తేలిన తర్వాత సింగ్ 2022లో తన స్థానాన్ని కోల్పోయాడు. అతని భార్య నీలం దేవి ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి, కుటుంబం కోసం మోకామా స్థానంలో గెలిచింది. నవంబర్ 2న, గ్యాంగ్‌స్టర్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన దులార్ సింగ్ యాదవ్ హత్య కేసులో అనంత్ సింగ్‌ను అరెస్టు చేశారు. ప్రశాంత్ కిషోర్ జనతా సేవా పార్టీ (జెఎస్పీ) టికెట్‌పై పోటీ చేస్తున్న ప్రియదర్శి పియూష్ తరపున ప్రచారం చేస్తున్నప్పుడు యాదవ్ ను కాల్చి చంపారు.

Next Story