జైలులో ఉన్నా జాక్వెలిన్ ను వదలని సుకేష్ చంద్రశేఖర్

Jailed Conman's Easter Wish For Jacqueline Fernandez. మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.

By M.S.R  Published on  9 April 2023 4:34 PM IST
జైలులో ఉన్నా జాక్వెలిన్ ను వదలని సుకేష్ చంద్రశేఖర్
మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఈసారి తన ప్రియురాలు, సినీ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌‌కు లెటర్ రాశాడు. ఈస్టర్ సందర్భంగా ఆమెకు విషెస్ తెలియజేశాడు. జాక్వెలిన్‌కు ఇష్టమైన ఫెస్టివల్‌కు ఆమెతో ఉండలేకపోతున్నానని.. వచ్చే ఏడాది ఈస్టర్‌ను బాగా జరుపుకుందామని మాట ఇచ్చాడు. ఏడాదిలో నీకు ఇష్టమైన పండుగల్లో ఇదొకటి.. నీతో గడిపిన ఆ ప్రత్యేకత క్షణాలను మిస్సవుతున్నాను అంటూ లేఖలో చెప్పుకొచ్చాడు. జాక్వెలిన్‌ తో సుకేష్ చంద్రశేఖర్ గతంలో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. సుకేష్ చంద్రశేఖర్ గతంలో ఖరీదైన కార్లు, బహుమతులు ఆమెకు ఇచ్చాడు. ఈ వ్యవహరంపై జాక్వెలిన్‌ను ఈడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. ప్రస్తుతం మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని జైలులో ఉన్నాడు. జైలులో ఉండి కూడా సుకేష్ తన దందాను నడుపుతూనే ఉన్నాడని ఇటీవల కథనాలు వచ్చాయి.


Next Story