భారత 14వ ఉపరాష్ట్రపతిగా గురువారం జగదీప్ ధన్ కర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్భార్ హాల్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
ఇటీవల జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ధన్ కర్ విపక్షాలు మద్దతు ఇచ్చిన మార్గరెట్ అల్వాను ఓడించారు. మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు రాగా.. ధన్ కర్‌కు 528 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో 74.36 శాతం ఓట్లు సాధించారు. 1997 నుంచి జరిగిన చివరి ఆరు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం.
రాజస్థాన్ హైకోర్టులో లాయర్‌గా పచేసిన ధన్‌కర్.. మాజా ఉప ప్రధాని చౌదరి దేవీలాల్ చొరవతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 1989లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1990లో చంద్రశేఖర్ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 1991లో పీవీ నర్సింహారావు హయంలోనూ మంత్రిగా సేవలు అందించారు. 2019లో బెంగాల్ గవర్నర్‌గా విధులు నిర్వర్తించారు.