మరోసారి భారత న్యాయవ్యవస్థ టార్గెట్‌గా ఉపరాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik
మరోసారి భారత న్యాయవ్యవస్థ టార్గెట్‌గా ఉపరాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిని సుప్రీం కోర్టు ఆదేశించలేదంటూ జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రాజ్యాంగపరమైన అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే ‘అల్టిమేట్ మాస్టర్స్’ అని ధన్‌ఖడ్ పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ధన్‌కర్ పాల్గొని మాట్లాడుతూ.. పార్లమెంటే అత్యున్నతమైంది...అని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బిల్లులను ఉద్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నిర్దేశిత గడవులోగా రాష్ట్రపతి అయినా, గవర్నర్లు అయినా.. బిల్లులను క్లియర్ చేయాలని సుప్రీం కోర్టు పేర్కొన్నది. ఆ వ్యాఖ్యలను ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ తప్పుపట్టారు. రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే అధికారం న్యాయవ్యవస్థకు లేదన్నారు. అయితే ఇవాళ మళ్లీ అదే అంశంపై ఆయన రియాక్ట్ అయ్యారు. శాసన వ్యవస్థే అత్యున్నతమైందని, రాజ్యాంగం ఎలా ఉండాలన్న దాన్ని నిర్ణయించేది ఎన్నికైన ప్రజాప్రతినిధులే అని, అంతకు మించిన అధికారం ఎవరికీ లేదని జగదీప్ ధన్‌కర్ తెలిపారు.
సుప్రీంకోర్టుపై చేసిన వ్యాఖ్యలకు వస్తున్న విమర్శలను కౌంటర్ చేస్తూ మరో సారి ఆయన న్యాయ వ్యవస్థను టార్గెట్ చేశారు. రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం తాను మాట్లాడిన ప్రతి మాట.. అత్యున్నతమైన జాతి ప్రయోజనాలతో చేసిందే అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ని సుప్రీంకోర్టు దుర్వినియోగం చేస్తున్నట్లు ఇటీవల ధన్‌కర్ ఆరోపించారు. ఆ ఆర్టికల్‌ను అణ్వాయుధ క్షిపణిగా ప్రజాస్వామ్య దళాలపై వాడుతున్నట్లు ఆయన ఆరోపించారు.