ఇరాన్‌ అధ్యక్షుడి మృతి.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్‌

ఆదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీకి నివాళులర్పిస్తూ మే 21న ఒక రోజు సంతాప దినంగా భారతదేశం ప్రకటించింది.

By అంజి  Published on  20 May 2024 2:15 PM GMT
Iran President, President Raisi, India, one day state mourning

ఇరాన్‌ అధ్యక్షుడి మృతి.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్‌

ఆదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ, ఆ దేశ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దోల్లాహియాన్‌లకు నివాళులర్పిస్తూ మే 21న ఒక రోజు సంతాప దినంగా భారతదేశం ప్రకటించింది. రైసీ గౌరవార్థం ఆ రోజున దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. 1989లో ఇరాన్‌ తొలి సుప్రీంలీడర్‌ అయతొల్లా రుహోల్లా ఖొమేనీ మరణించిన సమయంలో భారత్‌ 3 రోజులు సంతాప దినాలు పాటించింది.

ఇరాన్‌‌ సుప్రీం లీడర్‌‌‌గా అధికారం చేపట్టడానికి అడుగు దూరంలో నిలిచారు ఇబ్రహీం రైసీ. ఆ స్థానానికి ఆయనే తగిన వారనే సిఫార్సులు కూడా ఉన్నాయి. కానీ, ఒక నాటకీయ పరిణామం ఈ పరిస్థితిని మార్చేసింది. ఆదివారం (మే 19) హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చనిపోయారు.ఆదివారం (మే 19) హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చనిపోయారు.

ఇరాన్ అధ్యక్షుడితో పాటు విదేశాంగ మంత్రి, మరికొంత మంది మరణించారు. ఇరాన్ -అజార్‌బైజాన్ సరిహద్దుల్లోని కలాసి, ఖొదాఫరీన్ అనే రెండు ఆనకట్టలను ప్రారంభించిన అనంతరం రైసీ ఈ హెలికాప్టర్‌లో తబ్రిజ్ నగరానికి బయల్దేరారు. రైసీ కాన్వాయ్‌లో మూడు హెలికాప్టర్లు ఉండగా, వాటిలో రెండు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న బెల్-212 హెలికాప్టర్ మాత్రం ప్రమాదానికి గురైంది.

Next Story