'ఫోన్‌ లిఫ్ట్‌ చేసి హలో కాదు.. వందేమాతరం అనండి'

Instead of picking up the phone and saying hello, say Vande Mataram, the Maharashtra minister made interesting comments. దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ.. మహారాష్ట్ర సాంస్కృతి శాఖ మంత్రి సుధీర్‌

By అంజి
Published on : 15 Aug 2022 10:06 AM IST

ఫోన్‌ లిఫ్ట్‌ చేసి హలో కాదు.. వందేమాతరం అనండి

దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ.. మహారాష్ట్ర సాంస్కృతి శాఖ మంత్రి సుధీర్‌ ముంగంటివార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి 'ఫోన్‌ లిఫ్ట్‌ చేసి హలో కాదు.. వందేమాతరం అనండి' అంటూ వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కార్మికులకు కీలక సూచన చేశారు. ఇక నుంచి మీరంతా తమ ఫోన్లు లిఫ్ట్‌ చేసిన వెంటనే హలో అని కాకుండా వందేమాతరం సమాధానం ఇవ్వాలని ఆర్డర్‌ వేశారు. హలో అనేది ఇంగ్లీష్‌ పదమని.. అందుకే దాన్ని వదులుకోవడం మంచిదన్నారు. వందేమాతరం అనేది కేవలం పదం కాదు, ప్రతీ భారతీయుడు అనుభవించే అనుభూతి అని మంత్రి సుధీర్‌ వ్యాఖ్యానించారు.

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్నారని చెప్పారు. అందుకే అధికారులు ఫోన్‌ లిఫ్ట్‌ చేసే సమయంలో హలోకు బదులుగా వందేమాతరం అని చెప్పాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు విడుదల కానున్నాయని మంత్రి స్పష్టం చేశారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే పోర్ట్‌ఫోలియోలను అప్పగించిన కొద్దిసేపటికే రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.


Next Story