సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఏది పడితే అది చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు కొందరు. ఇన్‌ఫ్లుయెన్సర్‌లమని చెప్పుకొనే కొందరు తమకు కావాల్సిన వీడియోలను రికార్డు చేయడానికి ఎదుటివారిని ఇబ్బందులకు గురిచేస్తూ వస్తున్నారు. రీల్స్ చేసే ట్రెండ్ చాలా సాధారణం అయిపోయింది. కానీ ఈ చర్యలు కొన్నిసార్లు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్ చేయడానికి హైవేపై తన కారును మధ్యలో ఆపేసింది.
అయితే ఆమె చేసిన పనికి విమర్శలు ఎక్కువయ్యాయి. ఆమె వీడియోను చిత్రీకరించడం కోసం రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు ఘాజియాబాద్ పోలీసులు ₹ 17,000 జరిమానా విధించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరున్నర లక్షలకు పైగా అనుచరులను కలిగి ఉన్న వైశాలి చౌదరి తన కారును హైవేపై మధ్యలో ఆపినట్లు వైరల్ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో వైరల్ కావడంతో, ఘజియాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్‌లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వాహనం యజమానిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. Instagram ఇన్‌ఫ్లుయెన్సర్‌పై ₹ 17,000 జరిమానా కూడా విధించినట్లు చెప్పారు. ఈ ఘటన సాహిబాబాద్‌లో చోటుచేసుకుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఠాణా సాహిబాబాద్ పరిధిలోని ఎలివేటెడ్ రోడ్డుపై ఓ అమ్మాయి రీల్స్ చేయడం.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు సంబంధించి ఠాణా సాహిబాబాద్‌లో అభియోగాలు నమోదయ్యాయి. అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.ఆ కారుకు 17000 రూపాయలు చలాన్ వేశారని అధికారులు తెలిపారు.