త్రిపుర గవర్నర్‌గా తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి
త్రిపుర, ఒడిశా రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం బుధవారం రాత్రి ఒక ప్రకటన చేసింది.
By అంజి Published on 19 Oct 2023 3:04 AM GMTత్రిపుర గవర్నర్‌గా తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి
త్రిపుర, ఒడిశా రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం బుధవారం రాత్రి ఒక ప్రకటన చేసింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఒడిశా గవర్నర్‌గా, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి నల్లు త్రిపుర గవర్నర్‌లుగా నియమితులైనట్లు బుధవారం రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన తేదీల నుండి అమలులోకి వచ్చే ఈ నియామకాలు చేయడం పట్ల సంతోషిస్తున్నట్లు ఆ ప్రకటన పేర్కొంది.
ఇంద్రసేనారెడ్డి నల్లు తెలంగాణకు చెందిన బీజేపీ నేత. సూర్యాపేట జిల్లా వాసి అయిన ఇంద్రసేనారెడ్డి తెలంగాణ నుంచి బీజేపీ నేత, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు సార్లు మలక్ పేట అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలిసారి 1983లో, 1985, 1999లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేశారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఇంద్రసేనారెడ్డి గవర్నర్ కావడం విశేషం.
ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘుబర్ దాస్ 2014 నుంచి 2019 వరకు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీహార్, జార్ఖండ్ ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు రఘుబర్ దాస్ 1995లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పూర్తి కాలాన్ని పూర్తి చేసిన ఏకైక నాయకుడు రఘుబర్ దాస్ మాత్రమే.