స్వీట్లు పంచుకున్న భారత్-పాక్ సైనికులు.. చైనా కూడా

Indo-Pak troops exchange sweets along LoC in J&K's Poonch.బోర్డర్ లోని పూంచ్, మెంధార్ క్రాసింగ్ పాయింట్ల వద్ద భారత

By M.S.R  Published on  1 Jan 2022 3:29 PM GMT
స్వీట్లు పంచుకున్న భారత్-పాక్ సైనికులు.. చైనా కూడా

బోర్డర్ లోని పూంచ్, మెంధార్ క్రాసింగ్ పాయింట్ల వద్ద భారత సైన్యం పాకిస్తానీ సైన్యంతో స్వీట్లు పంచుకుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దులో కొనసాగుతున్న కాల్పుల విరమణను దృష్టిలో ఉంచుకుని, జమ్మూ కాశ్మీర్‌లో శాంతి, సామరస్యాన్ని మరింత పెంపొందించే లక్ష్యంతో ఈ చర్య తీసుకోబడింది. ఇరుదేశాల సైనికాధికారులు మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి నాలుగు చోట్ల ఇలాంటివి చోటు చేసుకున్నాయి. మెంధార్ హాట్ స్ప్రింగ్స్ క్రాసింగ్ పాయింట్, పూంచ్ రావ్‌కోట్ క్రాసింగ్ పాయింట్, చకోటి యూఆర్ఐ క్రాసింగ్ పాయింట్ తోపాటు చిల్లానా తిత్వాల్ క్రాసింగ్ పాయింట్ అనే నాలుగు ప్రదేశాలలో నియంత్రణ రేఖ (LoC) వెంబడి భారత మరియు పాకిస్తానీ ఆర్మీ అధికారులు స్వీట్లు పంచుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

కొత్త సంవత్సరం సందర్భంగా భారత్‌, చైనా సైనికులు స్వీట్లు పంచుకున్నారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాలైన కేకే పాస్, డీబీవో, బాటిల్‌నెక్, కొంకలా, చుషుల్ మోల్డో, డెమ్‌చోక్ హాట్‌స్ప్రింగ్, నాథులా, కొంగ్రాలా, బమ్ లా, వాచా దమైలోని సైనిక శిబిరాల వద్ద శనివారం ఈ కార్యక్రమాలు జరిగినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. నూతన సంవత్సరం నేపథ్యంలో భారత్‌, చైనా సైనిక అధికారులు పరస్పరం మిఠాయిల బాక్సులను మార్చుకున్నట్లు పేర్కొంది.

Next Story