దేశంలో ఒమిక్రాన్‌ విజృంభణ.. 200కు పెరిగిన కేసులు.. ఆ రెండు రాష్ట్రాల నుంచే స‌గానికిపైగా

India’s Omicron tally reaches 200.ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌పంచ దేశాల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Dec 2021 11:50 AM IST
దేశంలో ఒమిక్రాన్‌ విజృంభణ.. 200కు పెరిగిన కేసులు.. ఆ రెండు రాష్ట్రాల నుంచే స‌గానికిపైగా

ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌పంచ దేశాల‌కు వ‌ణుకుపుట్టిస్తోంది. డెల్టా వేరియంట్ కంటే దాదాపు ఆరు రెట్ల‌ వేగంతో ఈ మ‌హ‌మ్మారి వ్యాపిస్తోంది. ఇప్ప‌టికే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ధాటికి బ్రిట‌న్‌, అమెరికా దేశాలు చిగురుటాకుల వ‌ణికిపోతున్నాయి. ఇక మ‌న దేశంలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. చాప‌కింద నీరులా క్ర‌మంగా అన్ని రాష్ట్రాల‌కు విస్త‌రిస్తూ ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 12 రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు పాకగా.. 200 ఒమిక్రాన్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం వెల్ల‌డించింది.

అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 54, ఢిల్లీలో 54 కేసులు న‌మోదు అయిన‌ట్లు పేర్కొంది. ఆ త‌రువాత‌ తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14, ఉత్తరప్రదేశ్‌లో 2, ఆంధ్రప్రదేశ్‌, చండీగఢ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్క కేసు నమోదైనట్లు తెలిపింది. సోమవారం వరకు దేశంలో 174 కేసులు నమోదవగా.. మంగళవారం వరకు ఆ సంఖ్య 200కు పెరిగాయి. కాగా.. మొత్తం బాధితుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు మహారాష్ట్రలో 28 మంది, ఢిల్లీలో 12 మంది, కర్ణాటకలో 15 మంది, రాజస్థాన్‌లో 18, ఉత్తరప్రదేశ్‌, ఏపీ, బెంగాల్‌లో ఒక్కొక్క‌రు చొప్పున మొత్తం 77 మంది బాధితులు కోలుకున్నారని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

Next Story