మిస్‌ యూనివర్స్‌గా భారత యువతి హర్నాజ్‌ సంధు.. 21 ఏళ్ల తర్వాత

India's Harnaaz Sandhu becomes Miss Universe 2021. మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని సొంతం చేసుకుంది భారత యువతి. 70వ మిస్‌ యూనివర్స్‌ -2021 పోటీలు ఇజ్రాయెల్‌ దేశంలో జరిగాయి. ఈ పోటీల్లో

By అంజి  Published on  13 Dec 2021 4:42 AM GMT
మిస్‌ యూనివర్స్‌గా భారత యువతి హర్నాజ్‌ సంధు.. 21 ఏళ్ల తర్వాత

మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని సొంతం చేసుకుంది భారత యువతి. 70వ మిస్‌ యూనివర్స్‌ -2021 పోటీలు ఇజ్రాయెల్‌ దేశంలో జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న పంజాబ్‌కు చెందిన 21 ఏళ్ల హర్నాజ్‌ కౌర్‌ సింధు.. మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ను గెలిచింది. దీంతో తిరిగి 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కింది. 1994లో మొదటిసారిగా సుస్మితా సేన్‌.. మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని ధరించింది. ఆ తర్వాత లారాదత్తా 2000వ సంవత్సరంలో విశ్వసుందరి కిరీటాన్ని ధరించింది. మళ్లీ ఇప్పుడు 2021లో హర్నాజ్‌ సంధు.. ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 21 ఏళ్ల తర్వాత 21 ఏళ్ల వయసు గల హర్నాజ్‌ సంధుకు మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కడం విశేషం. ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో ఈ అందాల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పరాగ్వే, దక్షిణాఫ్రికాకు చెందిన యువతులతో హర్నాజ్‌ సంధు పోటీ పడింది. ఆ తర్వాత మెక్సికోకు చెందిన మాజీ మిస్‌ యూనివర్స్‌ 2020 ఆండ్రియా మెజా మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని.. హర్నాజ్‌ సంధుకు ధరింపజేసింది.

భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు సోమవారం 70వ మిస్ యూనివర్స్‌గా కిరీటాన్ని పొందారు. దాదాపు 80 మంది పోటీదారులతో అగ్రస్థానంలో నిలిచారు. రన్నరప్ మిస్ పరాగ్వే నాడియా ఫెరీరా, రెండవ రన్నరప్ మిస్ సౌత్ ఆఫ్రికా లాలెలా మస్వానే నిలిచారు. హర్నాజ్ చండీగఢ్‌కు చెందిన 21 ఏళ్ల మోడల్, ఆమె చండీగఢ్‌ నగరంలో పాఠశాల, కళాశాలను పూర్తి చేసింది. ఆమె చాలా సంవత్సరాలు సినీ పరిశ్రమలో ఉంది, ఆమె పేరుకు అనేక పోటీ టైటిల్స్ కూడా ఉన్నాయి. ఆమె యారా దియాన్ పూ బరన్, బాయి జీ కుట్టాంగే వంటి పంజాబీ చిత్రాలలో కూడా నటించింది. హర్నాజ్ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ మిస్ చండీగఢ్ 2017, మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్ ఇండియా 2018, ఫెమినా మిస్ ఇండియా పంజాబ్ 2019 విజేతలుగా నిలిచారు.





Next Story