దేశంలో తొలి ప్రైవేటు రైలు ప్రారంభం
India's first private train service under ‘Bharat Gaurav Scheme' flagged off.భారత రైల్వే మొదలుపెట్టిన 'భారత్ గౌరవ్ పథకం'
By తోట వంశీ కుమార్
భారత రైల్వే మొదలుపెట్టిన 'భారత్ గౌరవ్ పథకం' కింద మొదటి ప్రైవేట్ రైలు మంగళవారం తమిళనాడులోని కోయంబత్తూర్ నార్త్ రైల్వే స్టేషన్ నుండి మహారాష్ట్రలోని షిర్డీకి బయలుదేరింది. ఈ రైలు గురువారం షిర్డీకి చేరుకుని, శనివారం తిరిగి కోయంబత్తూరుకు చేరుకుంటుంది. సౌత్ స్టార్ రైల్ ఈ సేవను అందిస్తుంది. ప్రైవేట్ ప్లేయర్, వెజ్ మీల్స్, స్నాక్స్, డివోషనల్ మ్యాగజైన్‌లు, బెడ్‌టైమ్ కిట్, రైల్లో ఇన్-హౌస్ డాక్టర్ సపోర్టును కూడా అందిస్తుంది.
రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో, "భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహిస్తోంది! 'భారత్ గౌరవ్' పథకం కింద మొదటి రిజిస్టర్డ్ సర్వీస్ ప్రొవైడర్‌ను పొందడంతోపాటు కోయంబత్తూర్ నార్త్ నుండి సాయినగర్ షిర్డీకి తొలి సర్వీసును ప్రారంభించిన మొదటి జోన్‌గా దక్షిణ రైల్వే అవతరించింది." అని పేర్కొంది.
భారతదేశం లోని అద్భుతమైన చారిత్రక ప్రదేశాలను ప్రజలకు చూపించడానికి భారత్ గౌరవ్ రైలును నడుపుతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్గంలో రైలు తిరుపూర్, ఈరోడ్, సేలం, యలహంక, ధర్మవరం, మంత్రాలయం వాడిలో ఆగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని మంత్రాలయం ఆలయంలో దర్శనానికి రైలు మంత్రాలయం రోడ్ స్టేషన్‌లో ఐదు గంటల పాటు ఆగుతుంది.
నవంబర్‌లో కేంద్రం ప్రకటించిన భారత్ గౌరవ్ పథకం ప్రకారం, ఏ ఆపరేటర్ లేదా సర్వీస్ ప్రొవైడర్ అయినా ప్రత్యేక పర్యాటక ప్యాకేజీల కోసం థీమ్ ఆధారిత రైళ్లను నడపడానికి భారతీయ రైల్వే నుండి రెండేళ్లపాటు రైళ్లను లీజుకు తీసుకోవచ్చు. ఆపరేటర్‌కు రూట్‌లు, హాల్ట్ పాయింట్‌లు, సర్వీస్ కోసం టారిఫ్‌లను కూడా నిర్ణయించుకోవచ్చు.