కోవిడ్ నాసల్ వ్యాక్సిన్ ఆవిష్కరించిన కేంద్రం
India’s first intranasal COVID-19 vaccine iNNCOVACC launched. న్యూఢిల్లీ: కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సమక్షంలో కేంద్ర
By అంజి Published on 26 Jan 2023 6:48 PM ISTన్యూఢిల్లీ: కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సమక్షంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం కోవిడ్-19 నాసికా వ్యాక్సిన్ ఇన్‌కొవాక్‌ని ఆవిష్కరించారు. గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనిని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (BBIL) బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (BIRAC) సహకారంతో అభివృద్ధి చేసింది. ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు కృష్ణా ఎల్ల, సుచిత్ర ఎల్ల పాల్గొన్నారు.
వ్యాక్సిన్ ఆవిష్కరణపై కేంద్రమంత్రి మాండవీయ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 65 శాతానికి పైగా వ్యాక్సిన్‌లు భారతదేశం నుండి సరఫరా అవుతున్నాయని అన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి నాసికా వ్యాక్సిన్‌ను తీసుకువచ్చినందుకు భారత్ బయోటెక్ బృందాన్ని, బయోటెక్ శాఖను అభినందిస్తూ.. ''ప్రపంచంలో మొట్టమొదటి ఇంట్రా-నాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్, ఇది ఆత్మనిర్భర్ భారత్ పిలుపుకు అద్భుతమైన రూపం" అని పేర్కొన్నారు. నాణ్యమైన, సరసమైన మందులను ఉత్పత్తి చేయడంలో భారతదేశపు వ్యాక్సిన్ తయారీ, ఆవిష్కరణ సామర్థ్యం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసించబడుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలిపారు.
BIRAC సహకారంతో మరొక వ్యాక్సిన్‌ను ఆవిష్కరించినందుకు భారత్ బయోటెక్‌ని అభినందిస్తూ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సాధారణ వ్యాధులకు వ్యాక్సిన్‌లు, మందులను అభివృద్ధి చేయడంలో భారతదేశం ముందంజలో ఉందని అన్నారు. ఈ టీకా పంపిణీ చాలా సులువు అని, సూది అవసరం లేదని కృష్ణ ఎల్ల వివరించారు. ఈ వ్యాక్సిన్‌తో ఐజీజీ, ఐజీఏ, టీ-సెల్ అనే మూడు రకాల ప్రతిస్పందనలు వస్తాయని, ప్రపంచంలోని మరే ఇతర వ్యాక్సిన్‌తో ఇది సాధ్యం కాదని కృష్ణ ఎల్ల తెలిపారు.
ఈ నాసికా వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పై బడిన వారికి బూస్టర్ డోస్‌గా ఇచ్చేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులు ఇచ్చింది.