మ‌రో టెన్ష‌న్‌.. 'స్కిన్​ బ్లాక్​ ఫంగస్'​.. తొలి కేసు న‌మోదు

India's first Black fungus found on skin in corona patient.క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ఇంకా కోలుకోక ముందే ఫంగ‌స్‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Jun 2021 4:21 AM GMT
మ‌రో టెన్ష‌న్‌.. స్కిన్​ బ్లాక్​ ఫంగస్​.. తొలి కేసు న‌మోదు

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ఇంకా కోలుకోక ముందే ఫంగ‌స్‌లు టెన్ష‌న్ పెడుతున్నాయి. మొద‌ట‌ బ్లాక్‌, ఆ త‌రువాత వైట్‌, దీని త‌రువాత ఎల్లో ఫంగ‌స్ కేసులు వెలుగుచూసిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా క‌రోనా నుంచి కోలుకున్న వారిలో ఈ ఫంగ‌స్ కేసులు ఎక్కువ‌గా న‌మోదు అవుతున్నాయి. వీటిలో బ్లాక్ ఫంగ‌స్ కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. ఇది చాల‌దు అన్న‌ట్లు ఇప్పుడు కొత్త‌గా స్కిన్ బ్లాక్ ఫంగ‌స్ వెలుగు చూసింది. దేశంలోనే మొదటి కేసును కర్ణాటకలోని చిత్రదుర్గలో నమోద్వ‌గా.. ఒక్కసారిగా కలకలం సృష్టించింది.

చిత్రదుర్గకు చెందిన 54 ఏళ్ల రోగికి స్కిన్ మ్యూకోయిడ్ మైకోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని డాక్ట‌ర్లు తెలిపారు. దేశంలో ఇదే తొలి కేసు అని చెప్పారు. బాధితుడు నెల రోజుల కిందట కరోనా బారినపడి కోలుకున్నాడు. బాధితుడికి మధుమేహం సైతం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. బాధితుడి కుడి చెవి దగ్గర ఉన్న చర్మంలో బ్లాక్‌ ఫంగస్‌ కనిపించిందని వైద్యులు చెప్పారు. ఇప్పటికే ఆ బాధితుడికి మొదటి దశ శస్త్రచికిత్స ద్వారా చర్మంపై ఉన్న బ్లాక్‌ ఫంగస్‌ను తొలగించారు. ఇప్పుడు రెండో దశ శస్త్ర చికిత్సకు సిద్ధమవుతున్న‌ట్లు వెల్ల‌డించారు. తలనొప్పి, వాంతులు బ్లాక్ ఫంగ‌స్ యొక్క‌ ప్రాథమిక లక్షణాలు కాగా.. మెదడులో వ్యాధి ముదిరితే రోగి సృహ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

Next Story