వాట్సాప్‌లో టీకా స్లాట్ బుకింగ్‌

Indians can now book Covid-19 vaccination appointments on WhatsApp.భారత్ లో వ్యాక్సినేషన్ ఎంతో వేగవంతంగా సాగుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2021 6:45 PM IST
వాట్సాప్‌లో టీకా స్లాట్ బుకింగ్‌

భారత్ లో వ్యాక్సినేషన్ ఎంతో వేగవంతంగా సాగుతోంది. అయితే వ్యాక్సిన్ వేసుకోవాలని భావిస్తున్న కొందరికి స్లాట్ బుకింగ్ చేసుకోవడం ఇకపై మరింత సులువు అవ్వనుంది. వాట్సాప్‌ ద్వారానే టీకా స్లాట్ ను బుక్ చేసుకోవచ్చు.స్మార్ట్‌ఫోన్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం వాట్సాప్‌ను వినియోగిస్తూ.. వాక్సిన్‌ స్లాట్‌ బుకింగ్‌కు కేంద్రం అవకాశం కల్పించింది. వాట్సాప్‌ ద్వారా కరోనా హెల్ప్‌ డెస్క్‌ని ఈ ఏడాది మార్చిలో కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల ప్రారంభం నుంచి వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌ డౌన్‌లోడ్‌కి అవకాశం కల్పించింది. ఇప్పటికే ఈ హెల్ప్‌డెస్క్‌ నుంచి 31 లక్షల మంది వ్యాక్సిన్‌ సర్టిఫికేట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇకపై వాట్సాప్‌ ద్వారా వ్యాక్సిన్‌ స్లాట్‌ బుకింగ్‌కి అవకాశం కల్పించింది.

వాట్సాప్‌ ద్వారా వ్యాక్సిన్‌ బుకింగ్‌ చేసుకోవడానికి మైగవ్‌ కరోనా హెల్ప్‌ డెస్క్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా వ్యాక్సిన్‌ స్లాట్‌ బుక్‌ చేసుకోవాలంటే ఈ పద్దతులు పాటించాలి.

- మీ మొబైల్‌ నంబరులో 9013151515 నంబరు సేవ్‌ చేసుకోవాలి. ఇదే నంబరుకు 'బుక్‌ స్లాట్‌' అని ఇంగ్లీష్ లో టైప్‌ చేసి మెసేజ్‌ పంపాలి.

- ఆరు అంకెల ఓటీపీ నంబరు మీ మొబైల్‌కి వస్తుంది. మూడు నిమిషాల్లోగా ఓటీపీ నంబర్‌ ఎంటర్‌ చేయాలి

- ఆ నంబరు ఆధారంగా ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాలను బట్టి మనకు వివిధ ఆప్షన్లు వస్తాయి. అందులో మొదటి డోసు ఎప్పుడు ఇచ్చారు, రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలు ఉంటాయి

- హెల్ప్‌ డెస్క్‌ మెనూలో కుటుంబ సభ్యుల్లో ఎవరి పైరునైనా చేర్చాలా , దగ్గరలో ఉన్న వ్యాక్సిన్‌ సెంటర్‌ వివరాలు ఇలా వివిధ ఆప్షన్లకు 1, 2 ,3 ఇలా 8 వరకు నంబర్లు కేటాయించారు. మన అవసరానికి తగ్గట్టు నంబరును రిప్లై ఇస్తే దానికి తగ్గట్టుగా ఆప్షన్లు వస్తాయి.

- ఈ హెల్ప్‌లైన్‌ డెస్క్‌ ద్వారా వ్యాక్సిన్‌ స్లాట్‌ బుక్‌ చేసుకోవడంతో పాటు కరోనాకు సంబంధించి ఇతర సమాచారాన్ని కూడా తెలుసుకునే వీలుంది.

Next Story