రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. 968 వేసవి ప్రత్యేక రైళ్లు
Indian Railways to run 968 Summer Special Trains.రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని
By తోట వంశీ కుమార్ Published on 28 April 2022 3:37 PM ISTరైల్వే ప్రయాణీకులకు శుభవార్త. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాలకు 968 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఈనెలాఖరు (ఏప్రిల్ 30) నుంచి జూన్ వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. వీటిలో ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్- మన్మాడ్ మధ్య 126, దాదర్, మడ్గావ్ మధ్య మరో ఆరు, తిరుపతి-హైదరాబాద్, తిరుపతి-ఔరంగాబాద్ మధ్య 20 ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయని దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఈనెల 30 నుంచి వారాంతాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని చెప్పింది.
- హైదరాబాద్-తిరుపతి (07509) రైలు శనివారం సాయంత్రం 4.35కు హైదరాబాద్ నుంచి బయలుదేరి.. మరుసటిరోజు ఉదయం 5.30 గంటలకు తిరుపతి చేరుకుంటుందని తెలిపింది. ఈ రైలు ఏప్రిల్ 30, మే 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
- తిరుపతి-హైదరాబాద్ రైలు (07510) మంగళవారం 11.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ సర్వీసు మే 3, 10, 17, 24, 31 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
- తిరుపతి-ఔరంగాబాద్ (07511) స్పెషల్ ట్రెయిన్ ఆదివారం ఉదయం 07.05 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి.. మరుసటి రోజు 7 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుంది. ఇది మే 1, 8, 15, 22, 29 తేదీల్లో నడుస్తుంది.
- ఔరంగాబాద్- తిరుపతి (07512) రైలు ఔరంగాబాద్ నుంచి సోమవారం రాత్రి 11.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఇది మే 2, 9, 16, 23, 30 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఇవి సత్తెనపల్లి, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర మీదుగా వెళ్తాయని చెప్పారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.