ప్రయాణికులకు శుభవార్త : రేపటి నుంచి ఈ-కేటరింగ్‌ సేవలు

Indian Railways to resume e-catering services from 1st February. ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ఈ-కేటరింగ్‌ సేవలను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది.

By Medi Samrat  Published on  31 Jan 2021 9:20 AM IST
Indian Railways to resume e-catering services from 1st February

ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ఈ-కేటరింగ్‌ సేవలను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. కరోనా కార‌ణంగా గతేడాది మార్చి‌ నుండి ఈ-కేటరింగ్‌ సేవలు నిలిపివేశారు. లాక్‌డౌన్ త‌రువాత దశలవారీగా రైల్వేశాఖ కొద్దికొద్దిగా రైళ్లను నడుపుతున్నా.. ఈ-కేటరింగ్‌ సేవలను మాత్రం ప్రారంభించలేదు.

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆంక్షలు నడలిస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదలవుతుండడంతో ఈ-కేటరింగ్‌ సేవలను పునః ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీంతో ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి తమ బెర్తు వద్దకే తెప్పించుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ ఈ-కేటరింగ్‌ వెబ్‌సైట్‌ https://www.ecatering.irctc.co.in, 1323 నెంబర్‌ ద్వారా, ఐఆర్‌సీటీసీ ఈ-కేటరింగ్‌ యాప్‌ అయిన 'Food on Track' యాప్‌లోను ఆర్డర్‌ చేయొచ్చు.


అయితే.. ఈ-కేటరింగ్‌ సేవలు దేశ వ్యాప్తంగా ఒకేసారి కాకుండా.. దశలవారీగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా 62 రైల్వే స్టేషన్లలో ఈ సేవలు అందించనుంది.‌ న్యూఢిల్లీ, లక్నో, భోపాల్‌, సూరత్‌, పూణె, అహ్మదాబాద్‌, హౌరా, పాట్నా, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, సికింద్రాబాద్‌, ఎర్నాకుళం, ఉజ్జయిని, పన్వెల్‌తో పాటు మ‌రికొన్ని స్టేషన్లలో ఈ-కేటరింగ్‌ సేవలను అందించ‌నున్న‌ట్లు రైల్వేమంత్రిత్వశాఖ ట్వీట్‌ చేసింది.




Next Story