రైతుల ఆందోళ‌నల‌కు ఆరునెల‌లు.. నేడే బ్లాక్ డే

Indian farmers' protest completes six months.ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో అన్న‌దాత‌లు(రైతులు) చేస్తున్న ఆందోళ‌న‌లకు నేటితో ఆరు నెల‌లు పూర్తి అవుతాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 May 2021 4:32 AM GMT
former protest

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో అన్న‌దాత‌లు(రైతులు) చేస్తున్న ఆందోళ‌న‌లకు నేటితో ఆరు నెల‌లు పూర్తి అవుతాయి. ఈ సంద‌ర్భంగా నేడు బ్లాక్ డే పాటించాల‌ని రైతు సంఘాలు నిర్ణ‌యించాయి. గ్రామాలు మొదలుకొని ఢిల్లీ దాకా అంద‌రూ ఇళ్లు, దుకాణాలపై నల్లజెండాలను ఎగురవేయాలని, వాహనాలకు నల్లజెండాలు కట్టుకోవాలని పిలుపునిచ్చారు. న‌ల్ల‌జెండాలు ఎగుర‌వేయాల‌ని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది.

బుధ‌వారం బుద్ధ పూర్ణిమ ప‌ర్వ‌దినం. స‌మాజంలో స‌త్యం, అహింస క‌ర‌వుతున్నాయి. ఈ ప్ర‌ధాన విలువ‌ల పున‌రుద్ద‌ర‌ణ జ‌రిగేలా పండుగ జ‌రుకోవాల‌ని.. మోర్చా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. బ్లాక్‌డే సంద‌ర్భంగా ఢిల్లీలో పోలీసులు గ‌స్తీని పెంచారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటించాల‌ని, ఎక్క‌డా గుంపులుగా చేర‌కూడ‌ద‌ని రైతుల‌కు ఢిల్లీ పోలీసులు సూచించారు. ఢిల్లీలో క‌రోనా ప‌రిస్థితుల ధృష్ట్యా బాధ్య‌త‌త‌లో వ్య‌వ‌హ‌రించాల‌నన్నారు. కాంగ్రెస్ నేత న‌వ్య‌జ్యోత్ సింగ్ సిద్ధూ ప‌టియాలాలోని త‌న ఇంటిపై న‌ల్ల‌జెండా ఎగుర‌వేశారు.

వ్యవసాయ చట్టాలకు నిరసనగా 'చలో ఢిల్లీ' నినాదంతో రైతులు గ‌తేడాది నవంబర్‌ 26న ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. అప్ప‌టి నుంచి ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో నిర‌స‌న‌లు కొన‌సాగిస్తున్నారు. వణికించే చలిని కూడా లెక్కచేయకుండా రైతులు చాలారోజుల పాటు ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధించిన విషయం తెలిసిందే. కేంద్రంతో పలుమార్లు రైతు సంఘాల చర్చలు జరిగిన‌ప్ప‌టికీ అవి విఫలమయ్యాయి.


Next Story
Share it