రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-21 ఫైటర్ జెట్.. వింగ్ కమాండర్ మృతి

Indian Air Force's MiG-21 Fighter Jet Crashes In Rajasthan.త‌మిళ‌నాడులోని నీల‌గిరి కొండ‌ల్లో హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Dec 2021 4:13 AM GMT
రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-21 ఫైటర్ జెట్.. వింగ్ కమాండర్ మృతి

త‌మిళ‌నాడులోని నీల‌గిరి కొండ‌ల్లో హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా 12 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను ఇంకా మ‌రువ‌కముందే.. భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్ రాష్ట్రంలో కుప్ప‌కూలింది. శుక్ర‌వారం రాత్రి జైసల్మేర్‌కు స‌మీపంలో ఈ విమానం కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో వింగ్ క‌మాండ‌ర్ హర్షిత్ సిన్హా క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని భార‌త ఎయిర్ ఫోర్స్ ధృవీక‌రించింది.

'శుక్ర‌వారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో IAFకి చెందిన మిగ్-21 విమానం శిక్షణా సమయంలో పశ్చిమ సెక్టార్‌లో ప్రమాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న‌లో వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా మ‌ర‌ణించారు. వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి' తెలుపుతున్న‌ట్లు ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ ట్వీట్ చేసింది. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తున‌కు ఆదేశించిన‌ట్లు వెల్ల‌డించింది.

శామ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని డీసెర్ట్‌ నేషనల్‌ పార్క్‌ సమీపంలో మిగ్‌-21 ఫైటర్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ కూలినట్టు జైసల్మేర్‌ జిల్లా ఎస్పీ అజయ్‌సింగ్ తెలిపారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న‌ట్లు వెల్ల‌డించారు. అయితే ఇండో-పాక్‌ బార్డర్‌ వద్ద ఈ యుద్ధ విమానం కూలడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాంకేతిక సమస్యల కారణంగా కూలిందా లేక ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది.

Next Story