అగ్ని ప్రైమ్ మిస్సైల్ ప‌రీక్ష స‌క్సెస్

India Successfully Testfires Nuclear Capable Strategic Agni Prime Missile.‘ఒడిశా తీరంలోని బాలాసోర్‌లో అగ్ని ప్రైమ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Dec 2021 2:14 PM IST
అగ్ని ప్రైమ్ మిస్సైల్ ప‌రీక్ష స‌క్సెస్

1,000 నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలనే ఛేదించే అణ్వాయుధ సామర్థ్యం గల వ్యూహాత్మక అగ్ని క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. శనివారం ఒడిశాలోని బాలాసోర్ వీవర్ వ‌ద్ద ఈ క్షిప‌ణి ప‌రీక్ష చేప‌ట్టారు. అగ్ని-పీ మిస్సైల్ కొత్త జ‌న‌రేష‌న్‌కు చెందిన అడ్వాన్స్‌డ్ వేరియంట్. అగ్ని ప్రైమ్ క్యానిస్ట‌ర్ మిస్సైల్‌. దీని సామ‌ర్థ్యం 1000 నుంచి 2000 కిలోమీట‌ర్ల దూరం. అణ్వాయుధాలు మోసుకువెళ్లే సామ‌ర్థ్యం క‌ల‌ది. అగ్ని క్లాస్‌కు చెందిన ఈ మిస్సైల్‌లో అనేక కొత్త ఫీచ‌ర్ల‌ను జోడించారు. అత్యంత కచ్చితత్వంతో మిష‌న్ ల‌క్ష్యాల‌ను చేరుకుంటుంది.

'ఒడిశా తీరంలోని బాలాసోర్‌లో అగ్ని ప్రైమ్ క్షిపణిని భారత్ ఈ రోజు విజయవంతంగా పరీక్షించింది. అగ్ని ప్రైమ్ అనేది అగ్ని శ్రేణి క్షిపణుల అధునాతన రూపాంతరం. ఇది 1,000 నుంచి 2,000 కి.మీల మధ్య శ్రేణి సామర్థ్యం కలిగిన క్షిపణి. అణు సామర్థ్యం గలిగిన వ్యూహాత్మక క్షిపణి. అగ్ని ప్రైమ్‌కు చాలా కొత్త ఫీచర్లు జోడించారు. క్షిపణి దాని మిషన్ లక్ష్యాలన్నింటినీ అధిక ఖచ్చితత్వంతో చేరుకుంది' అని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

ఈ రోజు ఉద‌యం 11.06 నిమిషాల‌కు డీఆర్డీవో ఈ ప‌రీక్ష చేప‌ట్టింది. అగ్రి ప్రైమ్ క్షిప‌ణి ప‌రీక్ష స‌మ‌యంలో.. టెలిమెట్రీ, రేడార్‌, ఎల‌క్ట్రో ఆప్టిక‌ల్ స్టేష‌న్స్‌, డౌన్‌రేంజ్ షిప్స్‌ను తూర్ప తీరం వ‌ద్ద ట్రాక్ చేశారు. అనుకున్న‌ట్లే క్షిప‌ణి ట్రాజెక్ట‌రీ సాగింద‌న్నారు. హై లెవ‌ల్ అక్యురెసితో అన్ని అబ్జెక్టివ్‌లను అందుకున్న‌ట్లు డీఆర్డీవో తెలిపింది. కాగా.. ఈ క్షిపణిని చివరిసారిగా జూన్ 28 పరీక్షించారు. క్షిపణి అభివృద్ధి ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ద‌ళాల‌లో చేరేందుకు త్వ‌ర‌లో సిద్దంగా ఉంటుంద‌ని బావిస్తున్నారు.

దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం.. సైనికులకు ఆయుధాలను సమకూర్చే లక్ష్యంతో వివిధ క్షిపణీ పరీక్షలను నిర్వహిస్తుంది.

Next Story