'వారిని విడుదల చేయండి'.. రష్యాను గట్టిగా డిమాండ్‌ చేసిన భారత్‌

ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం రష్యన్ మిలిటరీ సపోర్ట్ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తున్న కేరళ వ్యక్తి మరణాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం ధృవీకరించింది.

By అంజి  Published on  15 Jan 2025 7:54 AM IST
India , nationals, Kerala man died, Russia war

'వారిని విడుదల చేయండి'.. రష్యాను గట్టిగా డిమాండ్‌ చేసిన భారత్‌ 

ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం రష్యన్ మిలిటరీ సపోర్ట్ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తున్న కేరళ వ్యక్తి మరణాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం ధృవీకరించింది. ఆ దేశంలోని ఆర్మీ నుండి మిగిలిన భారతీయ పౌరులను త్వరగా స్వదేశానికి రప్పించాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. "ఈ విషయం మాస్కోలోని రష్యా అధికారులతో పాటు న్యూఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయానికి ఈరోజు స్ట్రాంగ్‌గా చెప్పబడింది. మిగిలిన భారతీయ పౌరులను త్వరగా విడుదల చేయాలనే మా డిమాండ్‌ను కూడా మేము పునరుద్ఘాటించాము" అని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

త్రిసూర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ బినిల్ టిబి, ఇప్పుడు రష్యా నియంత్రణలో ఉన్న ఉక్రేనియన్ భూభాగంలో ఎక్కడో చిక్కుకుపోయి యుద్ధ ప్రాంతంలో మరణించినట్లు నివేదించబడింది. బినిల్‌తో పాటు రష్యాకు వెళ్లి ఫ్రంట్‌లైన్ సర్వీస్‌కి కేటాయించిన అతని కజిన్‌-ఎల్‌కె జైన్‌ టికె కూడా గాయపడ్డారు. బినిల్ (32), జైన్ (27) ఐటిఐ మెకానికల్ డిప్లొమా హోల్డర్లు,ఎలక్ట్రీషియన్లు.. ప్లంబర్లుగా పని చేయాలని ఆశతో ఏప్రిల్ 4 న రష్యాకు వెళ్లారు. అయితే, అక్కడికి చేరుకున్న తర్వాత, వారి భారతీయ పాస్‌పోర్ట్‌లు జప్తు చేయబడ్డాయి.

రష్యన్ మిలిటరీ సపోర్ట్ సర్వీస్‌లో భాగంగా వారిని యుద్ధ ప్రాంతానికి మోహరించారని వారి బంధువులను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. "రష్యన్ ఆర్మీలో పనిచేయడానికి రిక్రూట్ చేయబడిన కేరళకు చెందిన భారతీయ జాతీయుడు దురదృష్టవశాత్తు మరణించడం గురించి మేము తెలుసుకున్నాము. అదే విధంగా రిక్రూట్ చేయబడిన కేరళకు చెందిన మరో భారతీయుడు గాయపడి మాస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. " అని జైస్వాల్ అన్నారు.

రష్యాలో మరణించిన వ్యక్తి కుటుంబానికి MEA ప్రతినిధి సంతాపాన్ని తెలియజేశారు మరియు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం బాధిత కుటుంబాలకు చురుకుగా సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. "మేము మరణించిన వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. మాస్కోలోని మా రాయబార కార్యాలయం వారి కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతోంది. సాధ్యమైన అన్ని సహాయం అందించబడుతోంది. భౌతిక అవశేషాలను భారతదేశానికి త్వరగా తరలించడానికి మేము రష్యా అధికారులతో కలిసి పని చేస్తున్నాము. మేము గాయపడిన వ్యక్తిని త్వరగా డిశ్చార్జ్ చేసి భారతదేశానికి స్వదేశానికి రప్పించాలని కూడా కోరాం” అని జైస్వాల్ తెలిపారు.

ఇప్పటి వరకు ఎనిమిది మంది భారతీయులు రష్యా ఆర్మీలో పని చేస్తూ మరణించినట్లు సమాచారం. ఆగష్టు 2024లో, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఈ మరణాలను ధృవీకరించింది. రష్యన్ సాయుధ దళాలలో చేరిన అదనంగా 63 మంది భారతీయ పౌరులు ఇప్పుడు ముందస్తు డిశ్చార్జ్‌ని కోరుతున్నారని వెల్లడించింది. ఎంఈఏ వారి రిక్రూట్‌మెంట్ యొక్క చట్టబద్ధత, ప్రక్రియ గురించి నిర్దిష్ట వివరాలను అందించడం మానేసినప్పటికీ, దాని పౌరుల భద్రత, తిరిగి రావడానికి హామీ ఇవ్వడంలో దాని నిబద్ధతను పునరుద్ఘాటించింది. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం బాధిత కుటుంబాలకు చట్టపరమైన, రవాణా మరియు కాన్సులర్ సహాయాన్ని అందించడానికి స్థానిక అధికారులతో సన్నిహితంగా సహకరిస్తోంది.

Next Story